తెలంగాణ

వంద క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, జూలై 28: మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం మడిపల్లి గ్రామంలో దాదాపు 200బస్తాల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న సుమారు రూ.2లక్షల విలువ చేసే 100క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం తొర్రూరు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తొర్రూరు సిఐ వి.చేరాలు, ఎస్సై డి.రమణమూర్తి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన రావుల అమృతమ్మ అనే మహిళ ఇంట్లో పెద్ద ఎత్తున రేషన్‌బియ్యం రవాణాకు సిద్ధంగా ఉన్నాయని గురువారం అర్ధరాత్రి తొర్రూరు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సిఐ చేరాలు, ఎస్సై రమణమూర్తి గ్రామాన్ని సందర్శించి ఆ ఇంటిని పరిశీలించారు. మడిపల్లి గ్రామానికి చెందిన దారం రమాదేవి అనే మహిళా అమృతమ్మ ఇంటిని అద్దెకు తీసుకొని మడిపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో అక్రమంగా రేషన్‌బియ్యాన్ని కొనుగొలు చేసి వరంగల్ రూరల్‌జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన దొడ్డ రమేష్, రాయపర్తి మండలం పెరికేడు గ్రామానికి చెందిన పుల్లూరు కృష్ణమూర్తి అనే మరో ఇద్దరు రేషన్‌బియ్యం వ్యాపారుల సహకారంతో గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతం నుండి రేషన్‌బియ్యాన్ని పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు. రేషన్‌బియ్య అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్నాయన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి జరుపగా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేసుకున్న ఎపి16యు 4315నెంబరు గల లారీ, టిఎస్ 24 90756నెంబర్ గల బోలెరో వాహనాలు బియ్యం రవాణాకు సిద్దంగా ఉన్నాయన్నారు. ఆ ఇంట్లో సుమారు 200బస్తాలు నిల్వచేసిన 100క్వింటాళ్లపైగా రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకొని బియ్యం రవాణాకు ఉపయోగిస్తున్న రెండు వాహనాలను సీజ్ చేశా మన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా రేషన్‌బియ్యాన్ని తరలిస్తున్న నేరంపై దారం రామాదేవి, కృష్ణమూర్తి, రమేష్‌లపై పౌరసరఫరాల శాఖ అధికారులు 6ఎ కేసు నమోదు చేయగా, తొర్రూరు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు సిఐ వివరించారు.
ఈ దాడుల్లో పౌరసరఫరాల శాఖ డిప్యూటి తహశీల్దారు నారాయణరెడ్డి, మండల రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. రేషన్ బియ్యాన్ని పరిశీలిస్తున్న సిఐ చేరాలు