తెలంగాణ

భిక్కనూరులో వృద్ధురాలు హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, జూలై 28: భిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో వృద్ధురాలు హత్యకు గురైన సంఘటన సంచలనం రేకెత్తింది. రేపొమాపో కాటికి పోయే సమయంలో వృద్ధురాలిని హత్య చేయడాన్ని కాలనివాసులు చలించిపోయారు. మండల కేంద్రానికి చెందిన శివరాత్రి లచ్చమ్మ (74) గురువారం రాత్రి అన్నం తిని తన రేకుల షెడ్డులో నిద్రకు ఉపక్రమించింది. భర్త కొమురయ్య రాత్రి పదిన్నర గంటల సమయంలో బాగా తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఈ సమయంలో భార్య భర్తల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే స్థాయికి వెళ్లిందన్నారు. అదును చూసిన కొందరు గుర్తు తెలియని దుండగులు లచ్చమ్మను ఉరి వేసి హత్య చేశారని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సిఐ కోటేశ్వర్‌రావు ఎస్‌ఐ రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరగడానికి గల కారణాలను కుటుంబ సభ్యులను వివరాలడిగి తెలుసుకున్నారు. మొద ట భర్త కొమురయ్యనే హత్య చేసి ఉంటాడని భావించి కాలని వాసులు, కుటుంబ సభ్యులు కొమురయ్య పై అనుమానం వ్యక్తం చేసినప్పటికి మృతదేహాన్ని దగ్గరికి వెళ్లి పరిశీలించిన మనుమలు, మా తాత కొట్టడం వల్ల చనిపోలేదని, మెడకు ఉన్న మరకలను చూసి ఉరి తీసి ఉంటారని, పోలీసులకు వివరించడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తుసాగించారు. వెం టనే డాగ్ స్క్వాడ్‌ను రప్పించి దర్యాప్తు సాగించినప్పటికీ ఫలితం లేకపోయింది. వద్ధురాలిని చంపాల్సిన అవసరం ఎవరికి లేదని, ఆమె వద్ద కు డబ్బులు, నగలు లేవని కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన కామారెడ్డి డిఎస్‌పి ప్రసన్న రాణి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె వెళ్లిన కొద్ది సేపటికి జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి స్థలానికి చేరుకుని మృతురాలి దేహాన్ని చూసి పోస్టుమార్టం కోసం కామారెడ్డికి పంపించాలని స్థానిక పోలీసులను ఆదేశించింది.