తెలంగాణ

రామేశ్వర్‌పల్లిలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, జూలై 28: అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ మం డల కేంద్రమైన భిక్కనూరులో దళితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్థానిక సినిమా టాకీస్ చౌరస్తాలో బైఠాయించి ఐదున్నర గం టల పాటు రాస్తారోకో నిర్వహించడం తో రోడ్డుకిరువైపుల వాహనాలు నిలిచిపోయి. ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులెదురయ్యాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకునే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని దళితులు భీష్మించుకు కూర్చున్నారు. రాస్తారోకో ప్రారంభమైన అరగంట తర్వాత సిఐ కోటేశ్వర్‌రావు, ఎస్‌ఐ రాంబాబు, తహశీల్దార్ సుధాకర్‌రెడ్డిలు ఆందోళన కారుల వద్దకు చేరుకుని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోకుండా ఉన్నతాధికారులు రావల్సిందేనని నినాదాలు చేశారు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు, తహశీల్దార్‌లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. కామారెడ్డి డిఎస్పీ ప్రసన్న రాణి, ఆర్‌డిఓ శ్రీను ఆందోళన వద్దకు చేరుకుని వారిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఎంతో మంది మహానేతల విగ్రహాలున్నప్పటికీ కేవలం దళితనేత డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ఆందోళనకారులు అధికారులను ప్రశ్నించారు. గత నాలుగున్నర సంవత్సరాల క్రితం 44వ జాతీయ రహాదారి పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే నిందుతులను పట్టుకుని శిక్షిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని, మీ మాటల పై నమ్మకం లేదని తమకు న్యాయం జరగాలంటే జిల్లా కలెక్టర్ సత్యనారాయణ లేదా ఎస్పీ శే్వతరెడ్డి హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు.
దీంతో ఆర్‌డిఓ శ్రీను డిఎస్పీ ప్రసన్న రాణిలు ఫోన్‌లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా గంటన్నర తర్వాత దళిత నేతలు శాంతించి అధికారులు చెప్పిన మాట ప్రకారం ఆందోళన విరమిస్తామని చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.