తెలంగాణ

పట్టాదార్ పాస్ పుస్తకాల డిజిటలైజేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల పట్టాదార్ పాస్‌పుస్తకాలన్నీ డిజిటలైజేషన్ చేసి త్వరలో ఈ-పాస్‌పుస్తకాలను జారీ చేసేందుకు రెవెన్యూ శాఖ నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక మీదట పట్టాదార్ పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకుంటే రోజుల తరబడి వేచి చూసే అవసరం లేకుండా వేగంగా ఈ-పాస్‌పుస్తకాలు జారీ అవుతాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అన్ని రకాల అవసరాలకు అనుగుణంగా ఈ-పాస్‌పుస్తకాలను చెల్లుబాటయ్యే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీ విధానంలో ఉన్న భూమి నుంచి కొంత విడిపోతే ఆ విడిపోయిన భూమికి కొత్త పుస్తకం జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను 15 నుంచి 60 రోజుల సమయం రెవెన్యూ శాఖ తీసుకుంటోంది. గ్రామ రెవెన్యూ సహాయకుడి నుంచి ఆర్డీవో వరకు పాలనాపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేస్తారు. రెవెన్యూ శాఖలో చేపట్టబోయే అతిపెద్ద సంస్కరణగా దీన్ని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు రెవెన్యూ శాఖలోని తహసిల్‌దార్లందరికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ల్యాండ్ రికార్డులన్నింటిని సరిచేసి ఒక పద్దతి ప్రకారం తయారు చేయాలని ఆదేశించింది.
ఇలా సక్రమంగా క్రోఢీకరించిన సమాచారాన్ని రెవెన్యూ శాఖ వెబ్‌పోర్టల్‌కు లింక్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామాల వారీగా భూముల వివరాలు, జిల్లా స్థాయిలో వివరాలను పొందుపర్చాలని, అదే క్రమంలో పట్టాదార్ పాస్‌పుస్తకంలో ఉన్న పేరు, ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉందో వారి పేరు సరిపోయే విధంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పట్టాదార్ పాస్‌పుస్తకం ఒకరి పేరు మీద ఉండి, మరొకరి ఆధీనంలో ఉన్నట్లు (మిస్ మ్యాచ్) చూపిస్తే అది చెల్లుబాటు కాదని పేర్కొంది. ఈ రకంగా సమాచారాన్ని చాలా జాగ్రత్తగా వెబ్‌పోర్టల్ లింక్‌లో నిక్షిప్తం చేయాలని సూచించింది. సుమారు 15 రోజుల్లో భూముల రికార్డులన్నీ వెబ్‌పోర్టలో చేరేందుకు అవకాశం ఉంది.
ఇప్పటికే భూముల రికార్డులన్నీ సరిచేసే ప్రక్రియను రెవెన్యూ శాఖ చేపట్టింది. దీనిలో భాగంగా చనిపోయిన వారి స్ధానంలో వారి వారసుల పేర్లను చేర్చడం, ఎవరికైనా పేర్లు సరిచేయాలన్నా, భూములకు సంబంధించిన సమాచారాన్ని సరిచేయాలన్నా ఇప్పుడే ఆ ప్రక్రియ పూర్తి చేసి డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం తహసిల్‌దార్లను ఆదేశించింది. దాదాపు 70 శాతం మండలాల్లో భూముల రికార్డులు సరిచేసే ప్రక్రియ పూర్తి చేసిన రెవెన్యూ శాఖ మరో 15 నుంచి 20 రోజుల్లో పూర్తి చేసేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తోంది. భూముల రికార్డులు అన్నీ డిజిటలైజేషన్ పూర్తయితే ఒక్క బటన్ నొక్కితే ఈ-పాస్‌బుక్ దర్శనమిస్తుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది.