తెలంగాణ

సిఎం కెసిఆర్ అద్భుతమైన నాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29:కెసిఆర్ అద్భుతమైన నాయకుడని ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో ముఖ్యమంత్రిని ప్రశంసలతో ముంచెత్తారు. డ్రగ్స్ కేసులో సినిమా వారి సంబంధాలపై వర్మ ప్రతి రోజూ ట్విట్టర్‌లో తన శైలిలో స్పందిస్తున్నారు. తొలి రోజు విచారణ జరుపుతున్న పోలీసు అధికారుల తీరును విమర్శించారు. విచారణ అనంతరం సినీ తార చార్మి ఝాన్సీ లక్ష్మీబాయిలా కనిపించిందని పొగిడారు. హఠాత్తుగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారు బాధితులని ముఖ్యమంత్రి కెసిఆర్ సమస్యను సరిగ్గా అర్ధం చేసుకున్నారని అన్నారు. కెసిఆర్ అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడు, ముఖ్యమంత్రి విజన్‌తో వెళుతున్నారు, విచారణ జరుపుతున్న అధికారులు కూడా ఈ విజన్‌తో వెళితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సిట్ బృందం విచారణ తీరును, మీడియా ప్రచారం కల్పిస్తున్న తీరును పై వర్మ మొదటి నుంచి విమర్శిస్తూ వచ్చారు.