తెలంగాణ

కాంగ్రెస్‌వి చిల్లర రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29:కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో చిల్లర రాజకీయా లు చేస్తున్నారని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తలసాని శనివా రం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానుకోని తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సిరిసిల్ల ఘటనపై కాంగ్రెస్ నాయకులు అనవసర రాద్ధాం తం చేస్తున్నారని మం డిపడ్డారు. దళితులపై కాంగ్రెస్‌ది మొసలి కన్నీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మొత్తాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, దళితుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామం అభివృద్ధి చెందే విధంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. చివరకు కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆధారాలు లేకుండా అవాకులు చవాకులు పేలుతున్న నాయకులు ఇకనైనా మారాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇప్పుడున్న సీట్లు కూడా దక్కవని తలసాని చెప్పారు.