తెలంగాణ

టిఆర్‌ఎస్- బిజెపి పొత్తు ఊహాగానమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29:వచ్చే ఎన్నికల్లో టిర్‌ఎస్ బిజెపి పోటీ చేస్తాయి అనేది ఊహాగానాలు మాత్రమేనని, అలాంటిదేమీ లేదని టిఆర్‌ఎస్ ఎంపి కవిత తెలిపారు. రక్షాబంధన్ వినూత్నంగా చేసుకోవాలని కోరుతూ సిస్టర్స్ ఫర్ ఛేంజ్ కార్యక్రమం చేపట్టారు. రాఖీ పండుగ సందర్భంగా అన్నకు రాఖీతో పాటు హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలని కోరారు. హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాల్లో చాలా మంది చనిపోతున్నారని, మా అన్నకు బైక్ లేదు కనుక హెల్మెట్‌తో పాటు బైక్ బహుమతిగా ఇస్తానని కవిత తెలిపారు. కెటిఆర్‌కు కారులో బెల్ట్ పెట్టుకోవాలని కూడా చెబుతానని అన్నారు. కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ ఆరోపణలు పట్టించుకోవలసిన అవసరం లేదని అన్నారు. కెటిఆర్‌పై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపించాలని అన్నారు. నియోజక వర్గాలు పెంచక పోయినా టిఆర్‌ఎస్‌కు వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. నాయకులను ఎలా సర్దుబాటు చేయా లో పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌కు తెలుసునని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో కెసిఆర్ నిర్ణయిస్తారని అన్నారు. డ్రగ్స్, పేకాట, గుండుబాను నిర్మూలించాల్సిందేనని, సినిమా పరిశ్రమను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని కవిత స్పష్టం చేశారు. రాఖీ సందర్భంగా సోదరులకు హెల్మెట్‌ను బహుమతిగా ఇచ్చే కార్యక్రమంలో సోదరీ మణులు కలిసి రావాలని కవిత కోరారు.