తెలంగాణ

ఎస్సై రాత పరీక్షా ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: తెలంగాణలో ఎస్సై రాత పరీక్షా ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫలితాల విడుదలలో జాప్యం చేయడం వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారని ఆయన శనివారం విలేఖరులతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనకు దిగితే వారిని అరెస్టు చేయడం సమంజసం కాదని అన్నారు. మూడో విడత అమర వీరుల స్పూర్తి యాత్ర ఆదివారం గన్ పార్కు వద్ద ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ యాత్ర సాయంత్రానికి గజ్వేల్ చేరుకుంటుందని, ఆ తర్వాత బహిరంగ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.