తెలంగాణ

డ్రగ్స్ రహిత తెలంగాణ చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: మన రాష్ట్రా న్ని డ్రగ్స్ రహిత తెలంగాణాగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. శనివారం రామకృష్ణమఠంలో వివేకానంద మాన వ వికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రద్ధాయువజన వర్క్‌షాప్‌కు ఆయన హాజరై యువతీయువకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చా రు. ఇటీవల యువత మత్తు పదార్ధాలకు బానిసలయి భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు ముఠాల కేసు విచారణలో వెలికి వస్తున్న మరికొందరి సినీ పెద్దల పేర్లను వెలికితీయవద్దని తనపై వత్తిడి పెరుగుతోందని, అయినప్పటికీ డ్రగ్స్ ను సమూలంగా అరికట్టేందుకు పోరాడుతానని అన్నారు. మన దేశం లో పుట్టి మనదేశంలో విద్యాబుద్ధులు నేర్చుకుని వారి మేధస్సును మన దేశ అభివృద్ధికి వినియోగించకుండా విదేశాలకు వలస పోతున్నారని విమర్శించారు. మన దేశంలో అది బాలేదు ఇది బాలేదు అని విమర్శలు చేసేకంటే వటిని బాగుచేసేందుకు కృషి చేయాలని సూచించారు.
యువతీ యువకులు ఖచ్చితమైన లక్ష్యంతో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే స్ధైర్యంతో ముందుకు సాగాలేకాని ఆత్మహత్యలు దేనికీ పరిష్కారం కాదని అన్నారు. తల్లి తండ్రులను గౌరవించటం, జాతీయగీతం ఆలపించేటప్పుడు తగిన గౌరవం ఇవ్వాలని, దేశభక్తి కలిగి ఉండాలని తెలిపారు.
రోజుకు ఏడు గంటలు కష్టపడి చదివితే ఐఏఎస్, ఐపిఎస్ సాధించవచ్చునని, ప్రజలకు నిజాయతీతో సేవ లు అందించాలంటే ఐఏఎస్, ఐపిఎస్ ఉద్యోగాలు ఉత్తమమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి ఙ్ఞనదానంద, వివేకానంద మానవ వికాస కేంద్రం సంచాలకులు స్వామి బోధమయానంద పాల్గొన్నారు.

చిత్రం.. అకున్ సబర్వాల్‌ను సత్కరిస్తున్న ఙ్ఞనదానంద