తెలంగాణ

దవాఖానాలపై దుష్ప్రచారం చేస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ప్రభుత్వ దవాఖానాలపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జె దవాఖానాలో కొత్తగా వౌలిక సదుపాయాలను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతోకలిసి శనివారం ప్రారంభించారు. రేడియోథెరపీ మిషన్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలకు ఉపయోగించే డిజిటల్ మెమ్మోగ్రఫీ, బ్లడ్‌బ్యాంక్ కంపోనెంట్స్ సెపరేటర్లను ఈ సందర్భంగా ప్రారంభించారు. ఐసియు తదితర విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బయట చికిత్స చేస్తే మూడున్నర లక్షలు ఖర్చయ్యే అత్యాధునిక రేడియో థెరపి మిషన్‌ను ప్రారంభించామన్నారు. పేదలకు ఖరీదైన వైద్యాన్ని తమ ప్రభు త్వం ఉచితంగా అందిస్తోందని మంత్రి తెలిపారు. నాలుగున్నర ఎకరాల్లో ఎంఎన్‌జె దవాఖానాను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఒకవైపు దవాఖానాలను పటిష్టం చేస్తూ ఉంటే కొంత మంది దుష్ప్రచారం చేయడం పట్ల మండిపడ్డారు. నిజం గా తప్పు జరిగితే సరిదిద్దుకుంటామన్నారు. తప్పుడు ఆరోపణలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, ఎంఎన్‌జె డైరెక్టర్ డాక్టర్ జయలత తదితరులు కూడా మాట్లాడారు.