తెలంగాణ

తెలంగాణలో విద్యకు కేంద్రం ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ రాష్ట్రం లో విద్యారంగాభివృద్ధికి కేంద్రప్రభు త్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని, జాతీయ విద్యాసంస్థలను మంజూరు చేస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. నేమీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు జరిగిన బడి- గుడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడులు అనే నినాదంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో 42 ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సౌకర్యాల కల్పన, 10వేల 600 మంది విద్యార్ధులకు సైకిళ్లు, పుస్తకాలు, దుస్తులు, క్రీడా సామగ్రీని పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మెగాసెసె అవార్డు గ్రహీత శాంతాసిన్హా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ సర్వ శిక్షా అభియాన్ కార్యక్రమానికి కేంద్రం 2200 కోట్ల రూపాయిలు అందించిందని చెప్పారు.
అదే విధంగా తాను ఎంపి లాడ్స్ నుండి హైదరాబాద్‌లో ఒక బాలికల పాఠశాలకు 2 కోట్లు ఇస్తానని చెప్పా రు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం, విశేష అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని ఎమ్మెల్యే జి కిషన్‌రెడ్డి అన్నారు. వారి సేవలను సమాజం వినియోగించుకోవాలని సూచించారు. విద్యకు పేదరికం లేదని, జ్ఞానం ఏ ఒక్కరి సొంతం కాదని మరో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ప్రభుత్వ పాఠశాలల్లో బాగా అమలు అవుతోందని అన్నారు. భేటీ బచావో-్భటీ పడావో, పర్యావరణ పరిరక్షణ- చెట్లు నాటడం వంటి అనేక కార్యక్రమాల్లో అంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక వేత్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చొరవ చూపడం సంతోషకరమని శాంతాసిన్హా అన్నారు. విద్యార్థుల జీవిత కలలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఆమె చెప్పారు.

చిత్రం.. పీపుల్స్ ప్లాజాలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్ధులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ