తెలంగాణ

విక్రమ్‌పై కాల్పుల ఘటన దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: నగరంలో కలకలం సృష్టించిన మాజీ మంత్రి ముకేశ్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనపై నెలకొన్న మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
విక్రమే కాల్చుకున్నాడా? లేక ఇంట్లో ఏమైనా జరిగిం దా? అన్న అంశంపై సాంకేతిక ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తనను కాల్చాడంటూ విక్రమ్ తనతో చెప్పినట్లు ఆయన భార్య షిపాలీ వ్యాఖ్యలో ఎంత వరకు నిజం ఉందన్న విషయంపై పోలీసులు శనివారం మరోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఎవరో వచ్చి కాల్పులు జరిపారన్న విక్రమ్‌గౌడ్ భార్య ఫిర్యాదు కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు ఆ కోణంలో ఆధారాలేమీ లభించనట్టు తెలిసింది. అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు, తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్న వారి సానుభూతిని పొందేందుకే విక్రమ్ కాల్పులకు పాల్పడి ఉంటాడా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. టాస్క్ఫోర్సు డిసిపి లింబారెడ్డి, బంజారాహిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌గౌడ్ వాంగ్మూలాన్ని సేకరించారు. ఇదే వారి దర్యాప్తునకు కీలకంగా మారింది. అలాగే కాల్పులకు వినియోగించి రివాల్వర్‌ను స్వాధీనం చేయాలని సూచించారు.
నా భర్త అన్ని విషయాలు చెప్పాడు2
విక్రమ్ గౌడ్ పోలీసులకు అన్ని విషయాలను చెప్పినట్లు ఆయన భార్య షిపాలీ తెలిపారు. తన భర్తపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ఆమె మీడియాను అపోలో ఆసుపత్రి ఆవరణలో కోరారు. పోలీసు శాఖపై తమకు పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే పోలీసులే అన్ని వివరాలు చెబుతరాని అన్నారు.