తెలంగాణ

జానాపై భగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ఉప రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అభినందన సభకు సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి హాజరుకావడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జానారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టి.పిసిసి సేవాదళ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్థన్ రెడ్డి అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు జానారెడ్డిపై అధిష్ఠానానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు అక్రమాలపై ఎఐసిసి పోరాటం చేస్తున్న తరుణంలో జానారెడ్డి వెళ్ళడం వల్ల పార్టీ నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం, అయోమయం నెలకొందని కనుకుల తెలిపారు. వెంకయ్య నాయుడు ఆత్మీయ సభకు జానారెడ్డి వెళ్ళడాన్ని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు తప్పుపట్టా రు. వెంకయ్యతో జానాకు ఆత్మీయ బంధం ఉంటే వారికి ఇంటికి వెళ్ళాలని, శుభ కార్యాలకు వెళ్ళాలి కానీ బిజెపి నిర్వహించిన సభకు ఎలా వెళతారని విహెచ్ ప్రశ్నించారు.
ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ కూడా అభ్యంతరం తెలిపారు. వెంకయ్య తెలంగాణ వ్యతిరేకి అని ఆయన అన్నారు. మరోవైపు బిజెపి, టిఆర్‌ఎస్‌పై తాము పోరాటం చేస్తుంటే జానారెడ్డి వెళ్ళడం వల్ల కింది స్థాయి కార్యకర్తలకు ఎటువంటి సంకేతాలు వెళతాయో అర్థం చేసుకోవాలని పార్టీ నాయకులు పలువురు అధిష్ఠానాన్ని ఉద్ధేశించి అంటున్నారు.