తెలంగాణ

మతోన్మాద శక్తులను ప్రతిఘటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: దేశంలో మతోన్మాద శక్తులను, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ నియంతృత్వ పాలనను ప్రతిఘటించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలో ప్రారంభమైన సిపిఐ జిల్లా కార్యదర్శుల వర్కుషాపులో ఆయన ప్రసంగించారు. కేంద్రంలోని బిజెపికి ప్రత్యామ్నాయంగా వామపక్ష ప్రజాతంత్ర, లౌకిక పార్టీలన్నింటిని ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు కృషిచేయాలని చెబుతూ వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆర్‌జెడి నాయకుడు లాలూప్రసాద్ యాదవ్‌పై, ఆయన కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలు సాకుగా చూపి బిజెపితో అంటకాగారని ఆయన ఆరోపించారు.
నితీష్‌కుమార్ అనైతిక రాజకీయ వ్యభిచారానికి పాల్పడడం చూస్తుంటే..రాజకీయాలు దేశంలో ఎంత కలుషితమవుతున్నాయో గమనించాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, నేరెళ్ల ఘటనను ఉదహరిస్తూ ఇసుక మాఫియాకు ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఊతాన్నిస్తుందనేది స్పష్టమవుతోందన్నారు. ప్రజాసమస్యలపై అన్ని జిల్లాల్లో అక్కడిక్కడే ప్రజాఉద్యమాలు నిర్వహించాలని, ఆగస్టు ఒకటిన హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బహిరం సభ నిర్వహించాలని కోరారు. ఈ వర్కుషాపు సిపిఐ నేత పల్లా నరసింహరెడ్డి అధ్యక్షతన జరుగగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లెపల్లి ఆదిరెడ్డి, పశ్య పద్మ, ఈర్ల నర్సింహ, తక్కళ్లపల్లి శ్రీనివాసరావులతోపాటు జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.