తెలంగాణ

ప్రత్యర్థులా? స్నేహితులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: రాష్ట్రంలో టిఆర్‌ఎస్, బిజెపి సంబంధాలపై రెండు పార్టీల శ్రేణుల్లో డైలా మా ఏర్పడింది. అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించి వెళ్లగానే ఇక దూకుడుగా అధికార పక్షంపై విరుచుకుపడాలి అని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దానికి తగ్గట్టు ఒకటి రెండు రోజులు రెండు పార్టీల నాయకులు పరస్పరం తీవ్రంగా విమర్శించుకుంటారు. చల్లబడిన తరువాత రెండు పార్టీల అధినేతలు ఒకరికొకరు మద్దతు ప్రకటిస్తారు. అభినందించుకుంటారు. దీంతో రెండు పార్టీల మధ్య వచ్చే ఎన్నికల్లో సంబంధాలు ఏ విధంగా ఉంటాయో, ఏ స్థాయి వరకు విమర్శలు చేయాలో అర్ధం కాని పరిస్థితి రెండు పార్టీల శ్రేణుల్లో ఏర్పడింది. ఎన్‌డిఏ భాగస్వామి కాకపోయి నా రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపికి తొలి మద్దతు దారుగా కెసిఆర్ నిలిచారు. అభ్యర్థి ఎంపిక, నామినేషన్ల దాఖలులో ప్రధానమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక రాష్టప్రతి ఎన్నికల ప్రచార సమయంలో రాష్టప్రతి అభ్యర్థిగా ప్రచారానికి వచ్చినప్పుడు రాం నాథ్ గోవింద్ పదే పదే కెసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు. తన పేరును ప్రకటించక ముం దే కెసిఆర్ మద్దతు ప్రకటించారని ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో కొన్ని అంశాల్లో బిజెపి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన కెసిఆర్ ఆ తరువాత క్రమంగా మోదీకి చేరువ అయ్యారు. కరెన్సీ రద్దు సమయంలో సొంత పార్టీ వారి కన్నా ఎక్కువగా ప్రధానమంత్రికి అండగా నిలిచారు. బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఒక దశలో కెసిఆర్ బిజెపి యేతర పార్టీలతో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని, బాధిత రాష్ట్రాలతో కలిసి ఐక్య పోరాటం చేస్తామని హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించినట్టు వెల్లడించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల బాధ్య త కేంద్రం ఆదీనంలో ఉండే విధంగా కేంద్రం పంపి న లేఖపై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ నిర్ణయం నిలిచిపోయింది. అప్పటి నుంచి క్రమంగా టిఆర్‌ఎస్ కేంద్రంతో సానుకూలంగానే ఉంటోంది. అప్పుడప్పుడు అమిత్‌షా వచ్చి ఇక దూకుడే అని ప్రకటించడం, ఆ తరువాత చల్లబడడం మామూలుగా మారిపోయింది.
జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో అమిత్‌షా హైదరాబాద్ పర్యటించి టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లాలని ప్రకటించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఐదుగురు బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నా ఆ నియోజక వర్గాల్లో ఒక్క డివిజన్‌లోనూ బిజెపి గెలవలేదు. కేవలం ఐదు డివిజన్లకు పరిమితం అయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే పలు వివాదాస్పద నిర్ణయాలకు కెసిఆర్ బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. దీంతో బిజెపి ప్రభుత్వంలో టిఆర్‌ఎస్ చేరుతుందా అనే ఊహాగానాలు సాగాయి. మంత్రివర్గంలో కవితకు స్థానం కల్పిస్తారు అని కాంగ్రెస్ విమర్శలు కూడా చేసింది.