తెలంగాణ

ముఖం చాటేస్తున్న కారు మబ్బులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: వచ్చే ఆగస్టు నెలలో వరుణుడు కరుణించకపోతే కరవుబారినపడుతామన్న ఆందోళన ఆంధ్ర, తెలంగాణ ప్రాంత రైతుల్లో తీవ్రమైంది. ఆగస్టు నెలలో వర్షాలు కురిస్తే ఫర్వాలేదు. లేని పక్షంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జూలై నెలలో భారీ వర్షాలతో రైతాంగాన్ని కరుణించిన వరుణుడు వరుసగా పది రోజుల నుంచి ముఖం చాటేయడంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రైతాంగం కలవరం చెందుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారి పెరుగుతున్నాయి. విద్యుత్ వినిమయం విపరీతంగా పెరుగుతోంది. ఈ సారి వర్షాలు బాగా వస్తాయన్న గంపెడాశతో తెలంగాణలో రైతులు ఉత్సాహంతో 43.24 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలకు వెళ్లారు. ఇంతవరకు వివిధ జిల్లాల్లో 31.25 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. గత పదిరోజులుగా ఒక్కసారి వర్షాలు నిలిచిపోవడంతో మెట్ట ప్రాంతాల్లోని రైతులు విలవిలలాడుతున్నారు. కాని వచ్చే ఆగస్టు నెలలో వరుణుడు కరుణించి విస్తారంగా వర్షాలు పడుతాయనే ఆశతో ఉన్నారు.
ఒక వేళ పొడివాతావరణం కొనసాగే పరిస్ధితి ఉంటే ఆల్మట్టి నుంచి నీటిని వదిలితే మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎత్తిపోతల స్కీంల కింద ఉన్న ఆయకట్టును కాపాడుకునేందుకు కర్నాటకకు లేఖ రాసే యోచనలో రాష్ట్రప్రభుత్వం ఉన్నట్లు సాగునీటి ఇంజనీర్లు చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ వల్ల చెరువులు నిండి, భూగర్భ జలలు సమృద్ధిగా ఉండడం శుభపరిణామం. రాష్ట్రప్రభుత్వం కూడా ముం దస్తు జాగ్రత్తగా పొడి వాతావరణం కొనసాగితే రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా స్కీం ల కింద ఉన్న ప్రాంతాలకు మంచినీటి ఎద్దడి తీవ్రమైంది. కృష్ణా బేసిన్‌లో కూడా నిరాశజనమైన పరిస్ధితులు నెలకొన్నాయి. రాయిచూర్ థర్మల్ ప్లాంట్‌కు నీటి సదుపాయం కోసం నారాయణ్‌పూర్ నుంచి కర్నాటక 26వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో ఆ నీరు జూరాలకు చేరుకుంది. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలనే నిర్ణయంతో నెట్టెంపాడు, బీమా, కోయిలసాగర్ స్కీంల కింద ఆయకట్టుకు కొంతలో కొంత నీటిని విడుదల చేశారు. కాని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆగమ్యగోచరంగా ఉన్నాయి. ఈ సీజన్‌లో 400 టిఎంసిలు ఈ ప్రాజెక్టులకు రావాలి. కాని ఇంతవరకు కేవలం 2.75 టిఎంసి నీరు మాత్రమే చేరింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద దాదాపు రెండు రాష్ట్రాల్లో 25 లక్షల ఎకరాల భూములకు సాగునీరు చేరాలి. దాదాపు ఒక కోటి మంది ప్రజలకు మంచినీటికి కటకట పరిస్ధితి తలెత్తింది. హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డితో పాటు గుం టూరు,ప్రకాశం జిల్లాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తుతోంది.
ఆల్మట్టి నిండింది కాని
ఆల్మట్టి నిండింది. 129.72 టిఎంసికి 123.32 టిఎంసి నీటి నిల్వ చేరింది. రెండులక్షల క్యూసెక్కుల ప్రవాహం నుంచి 35వేల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లోస్ పడిపోయాయి. భారీ నీటి ప్రవాహం రెండు వారాలు కొనసాగితే శ్రీశైలంకు కనీసం 50 టిఎంసి నీరు చేరితే రెండు రాష్ట్రాల్లో ఖరీఫ్, మంచినీటికి కరవుండేది కాదు. కాని రెండు రాష్ట్రాల అంచనాలు తలకిందులయ్యాయి. గత పది రోజులుగా వర్షాలు లేవు. ఆగస్టు నెలలో మొదటి మూడు వారాలు కూడా అనుకోని పరిస్ధితులు తలెత్తితే తప్ప పొడి వాతావరణం కొనసాగే ప్రమాదం లేకపోలేదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జూలై , ఆగస్టు నెలల్లో మంచివర్షాలు కురుస్తాయి. ఈ రెండు నెలల్లోల 30 రోజులు గడచిపోయాయి. ఆగస్టు నెల ఒకటే మిగిలి ఉంది. ఆరేబియా లేదా బంగాళాఖాతంలో అల్పవాయుపీడనాలు ఏర్పడి భారీ వర్షాలు కురవాల్సిన సమయం ఇదే. ఈ ఏడాది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సాధారణ వర్షపాతాలు నమోదయ్యే కేటగిరీలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో 53 శాతం మేర అదనంగా వర్షపాతంనమోదైతే, జూలై నెలలో 4 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. ఈ పరిస్ధితుల్లో మహారాష్టల్రో మహాబలేశ్వర్ ప్రాంతంలో భారీ వర్షాలు కూడా నిలిచిపోయాయి.
దీనివల్లనే ఆల్మట్టికి ప్రవాహం తగ్గిపోయిందని సాగునీటి ఇంజనీర్లు చెప్పారు. సాధారణంగా జూలై నెలాఖరు నుంచి శ్రీశైలంకు నీటి ప్రవాహం ప్రారంభం కావాలి. ఇక్కడ 215.81 టిఎంసికి కేవలం 19.56 టిఎంసి, నాగార్జునసాగర్‌లో 312.05 టిఎంసికి 116.56 టిఎంసి నీరు మాత్రమే ఉంది. తుంగభద్రలో 100.86 టిఎంసికి కేవలం 37.67 టిఎంసి నీరు ఉంది. ఆల్మట్టిదిగువున ఉన్న తెలంగాణలో తొలి ప్రాజెక్టు జూరాల 9.66 టిఎంసికి 6.19 టిఎంసి నీరు ఉంది.