తెలంగాణ

గజ్వేల్‌లో 111 మంది రైతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనే 111 మంది రైతు లు ఆత్మహత్య చేసుకున్నారని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. రైతు ల సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు టి.జెఎసి చేపట్టిన తెలంగాణ అమర వీరుల స్పూర్తి యాత్రలో భాగంగా ఆదివారం మూడ వ విడత యాత్రను ప్రొఫెసర్ కోదండరామ్ నగరంలోని అమర వీరుల స్థూపం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తాము ఈ యాత్ర చేపట్టామని ఆయన వివరించారు.