తెలంగాణ

1800 మంది కవుల కవితా గానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30:తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 31 జిల్లాల్లో కవి సమ్మేళనాలు నిర్వహించనున్నట్టు జాగృతి ప్రకటించింది. తెలంగాణ దిక్కార స్వభావానికి ప్రతీక, మన భాష సహజ నుడికారాన్ని సగర్వంగా చాటిన మహనీయుడు కాళోజి ఈ గడ్డ అస్థిత్వాన్ని చాటి రాష్ట్ర ఆవశ్యకతను వివరించిందని, ఈ ఇరువురు వైతాళికులను స్మరించుకుంటూ జయశంకర్ జయంతి ఆగస్టు ఆరున, కాళోజి జయంతి సెప్టెంబర్ తొమ్మిది లను పురస్కరించుకుని తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 31 చోట్ల కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసిం ది. తెలంగాణలో ఊరు, బాల్యం, జీవన విధానం, వృత్తులు, భాష, సంస్కృతి, కళలు, ప్రకృతి అంశాలపై ఈ కవితలు ఉంటాయి. పాల్గొనే ప్రతి కవిని సత్కరిస్తారు. ఎంపిక చేసిన కవితలతో కవితా సం కలనం ప్రచురిస్తారు. 31 జిల్లాల్లో 31 చోట్ల దాదాపు 1800 మంది కవులతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తెలిపారు. ఆగస్టు రెండున సిద్దిపేటలో ప్రారంభం అవుతుంది.
నాలుగున కొత్తగూడెం, ఐదున ఖమ్మం, ఆరున ఉదయం సూర్యాపేట, సాయంత్రం నల్లగొండ, ఏడున సాయంత్రం యాదాద్రి, ఎనిమిదిన సాయంత్రం సంగారెడ్డి, పదిన సాయంత్రం మెదక్, 11న కామారెడ్డి, 12న నిజామాబాద్, 13న బాసర(నిర్మల్ జిల్లా), 14న ఆదిలాబాద్, 19న మహబూబ్‌నగర్, 20న వనపర్తి, 21న గద్వాల్, 24న పెద్దపల్లి, 25న మంచిర్యాల, 276న ఆసిఫాబాద్, 27న ఉదయం సిరిసిల్ల సాయంత్రం కరీంనగర్, 28న జగిత్యాల, 30న మేడ్చల్ 31న తాండూరులో కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు.
సెప్టెంబర్ రెండున ఉదయం జనగామ, సాయంత్రం వరంగల్, మూడున భూపాలపల్లి, సాయంత్రం మహబూబాబాద్, నాలుగున నర్సంపేట, ఆరున సాయంత్రం రంగారెడ్డి, తొమ్మిదిన కాళోజి జయంతి రోజున హైదరాబాద్‌లో కవి సమ్మేళనం జరుగుతుందని నవీన్ ఆచారి తెలిపారు.