తెలంగాణ

డ్రగ్స్‌ను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: డ్రగ్స్‌ను అరికట్టాల్సిన బాధ్యత పౌరులపై కూడా ఉందని ఉప రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. బంజారాహిల్స్‌లోని కెబిఆర్ పార్కు వద్ద ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన ‘యాంటీ డ్రగ్ వాక్’ను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ మత్తు పదార్థాల (డ్రగ్స్)కు అలవాటై జీవితాలను నాశనం చేసుకోరాదని కోరారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లపై ఓ కనే్నసి ఉం చాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు, బిజెపి ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, సినీ నటులు జీవిత-రాజశేఖర్ దంపతులు, పలువురు టివీ ఆర్టిస్టులు ఈ వాక్‌లో పాల్గొన్నారు.

చిత్రం.. బంజారాహిల్స్‌లోని కెబిఆర్ పార్కు వద్ద ఆదివారం ‘యాంటీ డ్రగ్ వాక్’ను
ప్రారంభిస్తున్న వెంకయ్య నాయుడు