తెలంగాణ

సభ్య సమాజం తలదించుకునేలా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: సిరిసిల్లలో దళితులు, గిరిజనులు, బిసిలపై జరిగిన అమానుష దాడి సభ్య సమాజం తల దించుకునేలా ఉందని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆవేదన చెందారు. దళితులపై జరిగిన దాడి, నిర్భందాన్ని నిరసిస్తూ సిరిసిల్లలో సోమవారం కాంగ్రెస్ నిర్వహించనున్న సభలో పాల్గొనేందుకు మీరా కుమార్ ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం మీరా కుమార్ కరీంనగర్ బయలుదేరి వెళ్ళారు. ఆమె వెంట ఉత్తమ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులూ వెళ్ళారు. ఇలాఉండగా అంతకు ముందు ఆమె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల ఘటనను తీవ్రంగా ఖండించారు. సిరిసిల్లలో అమాయకులను అరెస్టు చేసి అక్రమంగా నిర్భందించి చిత్ర హింసలు పెట్టారని ఆమె విమర్శించారు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, అక్రమ నిర్భంధం చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె అన్నారు. దళితులపై దాడులు చేయడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదని ఆమె సూచించారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించేందుకే వచ్చానని, ఇక్కడి నుంచి నేరుగా సిరిసిల్ల వెళుతున్నానని మీరా కుమార్ తెలిపారు.

చిత్రం.. మీరా కుమార్