తెలంగాణ

అక్రమ రవాణా రహిత తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: తెలంగాణ రాష్ట్రాన్ని ‘మనుషులు, పిల్లల అక్రమ రవాణారహిత, వ్యభిచార రహిత రాష్ట్రం’గా మారుస్తున్నామని పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) అనురాగ్ శర్మ తెలిపారు. ‘అంతర్జాతీయ లైంగికవేధింపుల వ్యతిరేక పోరాట దినోత్సవం’ సందర్భంగా హైదరాబాద్ (బేగంపేట) లోని సెస్ (సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషియల్ స్టడీస్) ఆడిటోరియంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మహిళలు పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు మహిళలు వ్యభిచార రొంపిలోకి లాగబడకుండా అనేక చర్యలు తీసుకున్నామన్నారు. అందుకే జాతీయ స్థాయిలో నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసు నెంబర్ వన్ స్థానం సంపాదించిందన్నారు. ప్రతి మనిషి గౌరవంగా జీవించాలన్నదే తెలంగాణ ప్రభు త్వ ప్రధాన ఉద్దేశమన్నారు. అంతర్జాతీయంగా జరుగుతున్న నేరా ల్లో డ్రగ్స్ వ్యాపారం తర్వాత మనుషుల అక్రమ రవాణ, వ్యభిచారం వ్యాపారమే అతిపెద్ద నేరాల వ్యాపారంగా మారిందన్నారు. ఈ వ్యాపారం సమాజంలో పెద్ద సమస్యగా నిలుస్తోందన్నారు. నేరగాళ్లు పిల్లలను కిడ్నాప్ చేసి బాలకార్మికులుగా, వ్యభిచారం, నేరాల ప్రపంచంలోకి తీసుకువెళుతున్నారని డిజిపి పేర్కొన్నారు.
వ్యభిచార గృహాలు, అక్రమంగా చిన్నపిల్లలచేత పనిచేయించే ప్రాంతాలపై తాము (పోలీసు శాఖ) దాడులు చేస్తున్నామని డిజిపి పేర్కొన్నారు. సిఐడికి చెందిన ప్రత్యేక విభాగాలు ఇందుకోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. ‘ఆపరేషన్ ముస్కాన్’, ‘ఆపరేషన్ స్మైల్’ దాడుల సందర్భంగా వెట్టిచాకిరి నుండి పిల్లలను, వ్యభిచారం నుండి మహిళలను రక్షిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 953 అక్రమ రవాణా కేసులు నమోదు చేశామని, 1397 మంది పిల్లలను వెట్టిచాకిరీ నుండి మహిళలను వ్యభిచార గృహాల నుండి రక్షించామని వివరించారు. 1043 మందిని అరెస్ట్ చేసి కేసులు పెట్టామన్నారు. నేరగాళ్లలో చట్టం అంటే భయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యభిచార రొంపిలో నుండి రక్షించబడ్డ మహిళల గురించి వివరాలు బహిర్గతం చేయడం సరికాదని, క్షించబడ్డ మహిళలకు ఉపాధి కల్పించడం, జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం పెద్ద సవాల్‌గా మారిందన్నారు.
సమాజందే బాధ్యత: సౌమ్య
అక్రమ రవాణాకు మహిళలు గురికాకుండా, వ్యభిచార రొంపిలోకి మహిళలను దించకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులతో పాటు సమాజంపై కూడా ఉందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సిఐడి) సౌమ్యామిశ్రా పేర్కొన్నారు. మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా సభ్య సమాజంకూడా తన వంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు. లైంగివేధింపులను అరికట్టేందుకు పోలీసు అధికారులు, ప్రాసిక్యూటర్లలలో సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి ఈ సమావేశానికి హాజరైన పోలీసు అధికారులనుండి వారి వారి పరిధిలో కేసుల గురిం చి అడిగి సౌమ్యామిశ్రా తెలుసుకున్నారు. వ్యభిచార గృహాల్లో పట్టుబడ్డ మహిళలపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదు చేయకుండా వారిని సాక్ష్యులుగా నమోదు చేసి నేరానికి పాల్పడే అసలైన వారిని శిక్షించేలా చూస్తున్నామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. బాలికలు, మహిళలకు పురుషులతో పాటు సమాజం లో సమాన గౌరవం, సమాన హక్కు లు ఉండాలన్నదే తమ ప్రాజెక్టు ఉద్దేశమని స్వచ్ఛందసేవా సంస్థ ‘ప్లాన్ ఇండియా’ ప్రతినిధి అనితా కుమార్ తెలిపారు. పిల్లలు, మహిళల అక్రవరవాణాను అరికట్టేందుకు వివి ధ సంస్థలు, వివిధ శాఖల సహకారం తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నా రు. పిల్లల అక్రమ రవాణాకు సంబంధిం చి ప్రజల్లో అవగాహన పెంచేందుకు, చట్టాల గురించి తెలియచేసేందుకు కృషి చేస్తున్నామని మరో ఎన్‌జిఓ ‘మహిత’ ప్రోగ్రాం డైరెక్టర్ రమేష్ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వరరావు, యూనిసెఫ్‌కు చెందిన పిల్లల సంరక్షణ స్పెషలిస్ట్ సుధామురళి, యూనిసెఫ్ ప్రతినిధి డేవిడ్‌రాజు తదితరులు మాట్లాడారు.

చిత్రం.. హైదరాబాద్‌లోని సెస్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న డిజిపి అనురాగ్ శర్శ