తెలంగాణ

భూములు లాక్కుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 30: తరతరాలుగా పంటలను పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న విలువైన భూములు పంటలు పండించుకోవడానికి అనుకూలంగా లేవనే సాకుతూ రిజర్వాయర్ నిర్మాణానికి భూములు అప్పగించాలనడం విడ్డూరంగా ఉందని సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన రైతు బి.క్రిష్ణ ఆవేదన వ్యక్తం చేసారు. పంటల సాగుకు యోగ్యం కావని నిరూపిస్తే ప్రభుత్వానికి ఉచితంగా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ రైతు సవాల్ విసిరారు. ఆదివారం టిజెఎసి చైర్మన్ కోదండరాం నిర్వహించిన మూడవ విడత తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న రైతు క్రిష్ణ ప్రభుత్వం భూములు తీసుకుంటున్న తీరు లోపభూయిష్టంగా ఉందంటూ మొరపెట్టుకున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శాస్తవ్రేత్తలతో భూసార పరీక్షలు నిర్వహించి పంటల సాగుకు పనికిరానివని నిరూపిస్తే తనకున్న ఐదెకరాల పొలాన్ని ప్రభుత్వానికి ఉచితంగానే దానం చేస్తానని శపథం చేసారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండపోచమ్మ రిజర్వాయర్‌ను కేవలం 1.5 టిఎంసిల సామర్థ్యమని చెప్పారని, ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక 1.5 టిఎంసిల నుంచి 3 టిఎంసిలు, అనంతరం 7 టిఎంసిలు, అనంతరం 12 టిఎంసిలు, ఇప్పుడు 15 టిఎంసిలని చెప్పుకుంటూ రైతులను విస్మయానికి గురిచే స్తున్నారన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అధికారులు పొంతలేని సమాధానాలు చెబుతున్నారని, ప్రభుత్వం చెల్లిస్తామంటూ పరిహారం కూడా అంతుచిక్కకుండా ఉందని పలువురు రైతులు కోదండరాంతో మొరపెట్టుకున్నారు. 12 లక్షల పరిహారంతో పాటుగా డబుల్ బెడ్ రూం ఇండ్లు, మూడు గేదెలు, 9 కోళ్లు అన్నారని కానీ నిర్వాసితులమైన తమకు దక్కుతాయన్న నమ్మకం లేదన్నారు. ఇచ్చే హామీని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్‌ను కోరితే దాటవేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన కొంతమంది అధికార పార్టీ నాయకులు రైతులను తప్పుదారి పట్టిస్తూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించకుండా ఆంక్షలు పెడుతున్నారని రైతు క్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు.