తెలంగాణ

ఐదువేలమందికి ఉద్యోగావకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ, రైల్వే బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రైల్వే మెగా జాబ్ మేళా (మనకోసం)కు విశేష స్పందన లభించింది. ఆదివారం సికిందరాబాద్‌లోని రైల్వే డిగ్రీ కళాశాల ఆవరణలో రైల్వేశాఖకు చెందిన వారి పిల్లల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో రైల్వే కార్మికుల పిల్లల కోసం నిర్వహించిన మనకోసం జాబ్‌మేళాలో ఐదు వేల ఉద్యోగావకాశాలున్నట్టు చెప్పారు. రైల్వే అధికారులను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇలాంటి జాబ్‌మేళాను దేశవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం, రిటైర్డ్ కార్మికుల పిల్లల భవిష్యత్‌కు జాబ్‌మేళాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మెగా జాబ్‌మేళాలో 110 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఎన్‌వి రమణరెడ్డి, ఎంప్లారుూస్ యూనియన్ కార్యదర్శి రాఘవయ్య, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ దీవాన్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం.. రైల్వే మెగా జాబ్‌మేళాను ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ, దక్షిణ మధ్య రైల్వే జిఎం వికె యాదవ్ ప్రభృతులు