తెలంగాణ

2709 ఎకరాల భూ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం 2709 ఎకరాల భూమిని సేకరించనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా సేకరించిన అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా అడవులు పెంచడానికి యుద్ధ ప్రాతిపదికన భూమి సేకరించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం సేకరించాల్సిన భూమిపై సచివాలయంలో సోమవారం సమీక్ష జరిపారు. ఈ ప్రక్రియ కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుతో పాటు రోళ్లవాగు, పాలెంవాగు, మీడియం ప్రాజెక్టులు, ఎలిమినేటి మాధవరెడ్డి, దేవాదుల, కల్వకుర్తి, డిండి, తదితర ప్రాజెక్టులు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులు పొందడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.