తెలంగాణ

ఇంజనీరింగ్ విద్యార్థులకు సప్లిమెంటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: జెఎన్‌టియు హెచ్‌లో ఇంజనీరింగ్ ఫస్టియర్ పరీక్షల్లో దాదాపు 60 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో వారందరికీ సప్లిమెంటరీ రాసుకునే అవకాశాన్ని కల్పించినట్టు జెఎన్‌టియు హెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ యాదయ్య తెలిపారు. ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్ విద్యార్ధులు ఎక్కువ మంది ఫెయిల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే సెకండియర్, థర్డు ఇయర్ విద్యార్థులకు సైతం వారి క్రెడిట్స్ నిబంధనలను సడలించి రెండో సంవత్సరం నుండి మూడో సంవత్సరానికి, మూడో సంవత్సరం నుండి నాలుగో సంవత్సరానికి వారిని ప్రమోట్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం దృష్ట్యా విద్యార్ధులను తదుపరి క్లాసులకు హాజరయ్యేందుకు వీలుకల్పించాలని ఆయన కాలేజీల యాజమాన్యాలకు సూచించారు.
పర్వతారోహకులు పూర్ణ, శ్రీవిద్యలకు సత్కారం
యూరప్‌లోని ఎతె్తైన పర్యతం వౌంట్ ఎల్‌బ్రోస్ అధిరోహించిన తెలంగాణ గురుకుల విద్యార్ధినులు పూర్ణ, శ్రీవిద్యలను సాంఘిక సంక్షేమ మంత్రి జి జగదీష్‌రెడ్డి సత్కరించారు. విద్యార్ధుల ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. వీరికి త్వరలోనే అవార్డులను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్ధులను ప్రోత్సహించడంలో ముందున్న సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్, స్పోర్ట్సు ఆఫీసర్ రామ లక్ష్మణ్, చీఫ్ కోచ్ శేఖర్‌బాబులను మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. గురుకుల విద్యాసంస్థలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అందిస్తున్న సహకారం వల్ల విద్యార్ధులు అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారని కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
లా డీన్‌గా ప్రొఫెసర్ జి బి రెడ్డి
మూడు బంగారు పతకాలు సాధించి, న్యాయవిద్యలో ఎనలేని కృషి చేస్తున్న ప్రొఫెసర్ జి బి రెడ్డిని ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయవిభాగం డీన్‌గా నియమించారు. ఈ మేరకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం నిర్ణయం తీసుకున్నారు.
బయోకెమిస్ట్రీ డీన్‌గా ప్రొఫెసర్ వెంకటరమణా దేవిని, కామర్స్ విభాగం డీన్‌గా ప్రొఫెసర్ శంకరయ్యను, జాగ్రఫీ విభాగానికి ప్రొఫెసర్ బాలకృష్ణన్‌ను ఇండియన్ ఓషన్ స్టడీస్ డైరెక్టర్‌గా నియమించారు.
స్కూళ్లకు ఆర్‌ఎంఎస్‌ఎ గ్రాంట్లు
ఒక్కో పాఠశాలకు ఆర్‌ఎంఎస్‌ఎ కింద గ్రాంట్లు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరమ్మతులకు 20వేలు, పుస్తకాలు, పత్రికలు, క్రీడాపరికరాలకు ఐదువేలు, తాగునీటి సరఫరా, విద్యుత్ చార్జీలు, కేబుల్, ఇంటర్‌నెట్ చార్జీలకు 25వేలు వెచ్చిస్తారు.
ఇఎస్‌ఐ మెడికల్ కాలేజీ ఫీజుల ఖరారు
సనత్‌నగర్ ఇఎస్‌ఐ మెడికల్ కాలేజీ ఫీజులను ప్రభుత్వం సోమవారం నాడు ఖరారు చేసింది. ఇన్స్యూరెన్స్ ఉన్న పిల్లలకు వార్షిక ఫీజు ఎంబిబిఎస్‌కు 24వేలు, ఇతరులకు 60వేల రూపాయిలుగా ప్రభుత్వం నిర్ణయించింది.