తెలంగాణ

రోడ్డు ప్రమాదాల నివారణకు హైపవర్ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో సోమవారం రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి అధికారులతో ఉన్నత స్థాయిలో సమీక్షించారు. ఈ సమావేశంలో రవాణా, వైద్య, ఆరోగ్య, రోడ్లు, భవనాల శాఖ, ఆబ్కారీ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ప్రమాద రహిత తెలంగాణతో బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుదామని అన్నారు.
ప్రమాదాల నివారణకు విద్యాలయాల్లో అవగాహన పెంచాలని అన్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 2016లో 22,815 ప్రమాదాలు జరిగితే 7227 మంది చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా మరో 10 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. 2016లో 6609 ప్రమాద కారక కేసుల్లో లైసెన్సులు రద్దు చేశామని చెప్పారు. వీటిలో 20.71 లక్షల కేసులు నమోదు చేసి తద్వారా రూ.29.74 కోట్ల జరిమాన వసూలు చేయగా, 2017లో 12 కేసులతో రూ.15.58 కోట్ల జరిమాన వసూలు చేసినట్లు తెలిపారు. కొత్త రహదారులు ఇకమీదట నిర్మిస్తే సైకిల్ ట్రాక్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి 50 కి.మీకు 108 వాహనాలను హైవేల మీద అంటుబాటులో ఉంచుతూ, నల్గొండ జిల్లాలో 1033 నెంబర్ 108తో అనుసంధాన చేసిన విధానాన్ని అన్ని జిల్లాల్లో విస్తరించాలని అన్నారు.
సిఎం కెసిఆర్‌తో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేందుకు అవసరమైన చర్యలకు చర్చించి కనీసం 20 కోట్ల నిధులు రాబట్టుకుందామని తెలిపారు. రవాణా చట్టాలను అతిక్రమించే వారిమీద రానున్న చట్టాలు, పాయింట్‌ల విధానాన్ని కఠినంగా అమలు పరుస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రవాణా, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు సునీల్‌శర్మ, త్రివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి శివశంకర్, రోడ్డు భద్రత, రైల్వేపోలీస్ డిజిపి కృష్ణప్రసాద్, ఆర్టీసి ఎండి రమణారావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.