తెలంగాణ

నకిలీ సర్ట్ఫికెట్ల ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: హైదరాబాద్‌లో నకిలీ సర్ట్ఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టయింది. జెఎన్‌టియుకి చెందిన నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేస్తున్న ముఠా సభ్యుడిని వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బోడుప్పల్ బృందావన్ కాలనీకి చెందిన కె వినోద్‌కుమార్, కర్మన్‌ఘాట్‌కు చెందిన నరేందర్ కొంత కాలంగా జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీకి చెందిన నకిలీ సర్ట్ఫికెట్లను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వినోద్‌కుమార్ అంబర్‌పేట్ శివంరోడ్డులోని యాక్సెండర్స్ కన్సల్టెన్సింగ్ సర్వీసెస్ పేరుతో వ్యాపారం సాగిస్తున్నాడు. కాగా ఉస్మానియా వర్సిటీ వద్ద నిరుద్యోగులకు కావలసిన అర్హతకు సంబంధించి నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేసి రూ. 50వేల నుంచి లక్ష రూపాయల వరకు విక్రయిస్తున్నాడు.
సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు వినోద్‌కుమార్‌ను అదుపులోకి తీసుకోగా, నరేందర్ పరారయ్యాడు. వినోద్‌కుమార్ వద్ద నుంచి జెఎన్‌టియుకి చెందిన నకిలీ బిటెక్ సర్ట్ఫికెట్లు 16, హోలోగ్రామ్స్ 4, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం నల్లకుంట పోలీసులకు అప్పగించారు.