తెలంగాణ

అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు హెల్త్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు ఆరోగ్య కార్డుల అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన అక్రిడేషన్ లేని వివిధ పత్రికలు, చానెల్స్‌లో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారంతా ఆగస్టు 16లోగా దరఖాస్తు చేసుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్య బీమా కమిటీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన సోమవారం జరిగిన సమీక్షలో అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు ఆరోగ్య బీమా అందించేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఖరారు చేసినట్లు కమిషనర్ తెలిపారు. దరఖాస్తును పూర్తి చేసి ఎడిటర్ లేదా బ్యూరోచీఫ్, ఎడిషన్ ఇన్‌చార్జి లేదా జిల్లా స్ట్ఫా రిపోర్టతో సంతకం చేసి ధృవీకరణ తీసుకుని సమాచార శాఖ కమిషనర్ లేదా, జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో ఆగస్టు 16లోగా సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు గుర్తింపు కార్డు లేదా, అప్పాయింట్‌మెంట్ లెటర్, తదితర ఆదారాలు జత చేయాలని తెలిపారు. రిటైర్డు జర్నలిస్టుల విషయంలో 58 ఏళ్ల వయస్సుకు పైబడిన వారు దరఖాస్తుతో పాటు తమ పాత అక్రిడేషన్ లేదా అప్పాయింట్‌మెంట్ లెటర్, లేదా గుర్తింపు కార్డు, ఉద్యోగవిరమణ పత్రం ఏదో ఒకటి జత చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య బీమా కమిటీ సభ్యులు పల్లె రవికుమార్, విరాహత్ అలీ, క్రాంతి కిరణ్, బసవ పున్నయ్య, సమాచార శాఖ అధికారులు పాల్గొన్నారు.