తెలంగాణ

విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/మర్పల్లి, జూలై 31: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలోని కెజిబివి (కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం) హాస్టల్ వార్డెన్ విద్యార్థులను అవమానించడం, దుర్భాష, దూషణలకు తెగబడ్డారు. దీంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి తోటి విద్యార్థులు, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలిలావున్నాయి. కోట్‌పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కేరెల్లి సుమిత్ర, పెంటారెడ్డి దంపతుల కుమార్తె తుక్కమ్మతో పదిహేనేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన రాజేందర్‌రెడ్డితో వివాహమైంది. వీరికి కూతురు హారిక, కొడుకు గంగిరెడ్డి ఇద్దరు సంతానం. కాగా తుక్కమ్మ మృతి చెందడంతో వీరిని అమ్మమ్మ సుమిత్ర చేరదీసి పోషిస్తోంది.
హారిక (14)ను గత మూడేళ్ల ఖ్రితం మర్పల్లిలోని కెజిబివిలో ఏడవ తరగతిలో చేర్పించారు. గంగిరెడ్డి సంగారెడ్డిలో 5వ, తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం హారిక తొమ్మిదో తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటుంది. కాగా ఆదివారం విద్యార్థులు అందరు వారివారి గదుల్లో ఉండగా, హారిక కూడా రాత్రి గం. 11.30ల వరకు గదిలోనే ఉంది. సోమవారం ఉదయం విద్యార్థినిలు స్నానానికి వెళ్లగా పాఠశాల వెనుకభాగం వైపు హారిక చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ విగతజీవిలా కనిపించింది. దీంతో తోటి విద్యార్థులందరూ వాచ్‌మెన్ మణెమ్మకు తెలిపారు. సమాచారం అందుకున్న మర్పల్లి ఎస్‌ఐ విఠల్‌రెడ్డితోపాటు బంటారం ఎస్సై శేఖర్‌గౌడ్, మోమిన్‌పేట ఎస్సై ప్రణయ్‌కుమార్ సంఘటనపై ఆరా తీశారు. కాగా వార్డెన్ ప్రభావతి అందుబాటులో లేరు. వాచ్‌మెన్, వార్డెన్లు తరచూ అవమానిస్తూ, దుర్భాషతో దూషించే వారని, అందుకే హారిక ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. వార్డెన్, వాచ్‌మెన్ల నిర్లక్ష్యం, దురుసుతనం కారణంగానే తన మనుమరాలు ఆత్మహత్య చేసుకుందని సుమిత్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్, తహశీల్దార్ ప్రేమ్‌కుమార్, ఎంఇవో విద్యాసాగర్ స్పందించారు. వాచ్‌మెన్, వార్డెన్‌లపై చర్య తీసుకోవాలని ఆదేశించారు.
దీంతో విద్యాశాఖ అధికారులు వాచ్‌మెన్ మణెమ్మ, వార్డెన్ ప్రభావతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థిని కుటుంబీకులకు రూ. 3 లక్షల సాయం అందించేందుకు హామి ఇచ్చారు.