తెలంగాణ

రేషన్ డీలర్లను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: నామ మాత్రం కమీషన్‌తో రేషన్ డీలర్లు జీవనాన్ని కొనసాగించలేకపోతున్నారని, కమీషన్ పెంచి, ఆదుకోవాలని పౌరసరఫరాల శాఖ కమీషనర్ సివి ఆనంద్‌ను డీలర్లు కోరారు. కమీషన్ పెంచాలని కోరుతూ చేపట్టిన సమ్మెను పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమీషనర్ ఆనంద్‌పై నమ్మకంతో విరమిస్తున్నట్టు తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు తెలిపారు.
హమాలీల సమస్యలు పరిష్కరించాలి
హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెంటనే సమ్మె విరమించాలని పౌరసరఫరాల శాఖ కమీషనర్ సివి ఆనంద్ తెలిపారు. పౌరసరఫరాల శాఖ హమాలీలు ఈనెల 25 నుంచి నిరవధిక సమ్మె జరుపుతోంది. గతంలో ఇచ్చిన జివో ప్రకారం ఈఎస్‌ఐ చట్టాన్ని హమాలీలకు అమలు జరిగేట్టు చర్యలు తీసుకుంటామని చెప్పారు.