తెలంగాణ

లాలాపేట రైల్వే భూమిల్ని ఇప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: పేదల ఇళ్ల నిర్మాణానికి సికింద్రాబాద్ లాలాపేటలోని పదెకరాల రైల్వే స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించేలా చూడాలని కేంద్ర మంత్రి మంత్రి బండారు దత్తాత్రేయకును తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు విజ్ఞప్తి చేశారు. సోమవారంనాడు దత్తాత్రేయను ఆయన కార్యాలయంలో పద్మారావు కలిశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి రైల్వే భూమిని ఇవ్వాలని గతంలో రైల్వే శాఖ మంత్రికి ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేశారని తెలిపారు. దానికి ప్రతిఫలంగా భూమికి భూమి లేదా డబ్బు రూపేణా ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. దత్తాత్రేయ మాట్లాడుతూ వౌలాలీ, తార్నాకలలో పదకొండు ఎకరాల రైల్వేభూమి ఉందని, ఆ భూమిని రైల్వే బోర్డు అధికారులు లాండ్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఇచ్చారని వెల్లడించారు. 2020 నాటికి ప్రజలందరికీ ఇళ్లు నిర్మించాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని వెల్లడించారు. అలాగే సమస్యలను పరిష్కరించాలని సికింద్రాబాద్ కంటోనె్మంట్ బోర్డు సభ్యులు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. కంటోనె్మంట్ బోర్డుకు నిధులు, ఉద్యోగుల బదిలీ తదితర అంశాలపై రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చర్చిస్తానని దత్తాత్రేయ తెలిపారు.