తెలంగాణ

రేవంత్‌రెడ్డి పాదయాత్ర భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: మత్తు పదార్థాల (డ్రగ్స్) కేసులో ఉన్న వారి పేర్లు బయటపెట్టకుండా ఒత్తిడి తెస్తున్న వారెవరో బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారు. సోమవారం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించాలని టి.టిడిపి నేతలు, కార్యకర్తలు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఇంకా పార్టీ నాయకులు, కార్యకర్తలూ పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కాగా అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం నుంచి నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం వైపు పాదయాత్రగా బయలుదేరారు. కానీ అంబేద్కర్ విగ్రహం నుంచి లిబర్టీ చౌరస్తాకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు వారిని అరెస్టు చేసి పాదయాత్రను భగ్నం చేశారు.
హబ్‌ల బదులు పబ్‌లు: రేవంత్‌రెడ్డి
రేవంత్ రెడ్డి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐటి హబ్‌లు తీసుకుని వస్తే, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ పబ్‌లు తీసుకుని వచ్చిందని విమర్శించారు. ఇతర రాష్ట్రాలు నిషేధించిన డిజి షోలను హైదరాబాద్‌లో నిర్వహించడంతో పాటు వాటికి పర్యాటక శాఖ నిధులను మళ్ళించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో పబ్‌ల సంఖ్య 10కి మించకపోగా, టిఆర్‌ఎస్ పాలనలో 57 పబ్‌లకు అనుమతినిచ్చిందన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఎంత పెద్దవారున్నా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించగా, వారి పేర్లు బయట పెట్టవద్దని ఎవరు ఒత్తిడి తెస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

చిత్రం.. టిడిపి నేత రేవంత్‌రెడ్డి పాదయాత్రను అడ్డుకుంటున్న పోలీసులు