తెలంగాణ

తెలంగాణలో అధికారంలోకి వస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: వచ్చే ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, దానికి అనుగుణంగా గెలుపే లక్ష్యంగా రోడ్‌మ్యాప్ రూపొందించామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు. ఆగస్టు చివరి నాటికి బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటవుతాయని ఆయన చెప్పారు. ఇప్పటికే పల్లెపల్లెకు బిజెపి- ఇంటింటికీ మోదీ పేరుతో ఆరువేలమంది కార్యకర్తలు 23 వేల పోలింగ్ బూత్‌లలో పర్యటించారని తెలిపారు. అన్ని బూత్‌లలో నూతన కమిటీలను వేశామని, మరో పక్క ఆరు వేల శక్తి కేంద్రాలను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.
రాష్ట్రంలో పార్టీ మెరుగుకు జాతీయ పార్టీ చాలా స్పష్టమైన సంకేతం ఇచ్చిందని పేర్కొన్నారు. అమిత్ షా కూడా తెలంగాణ నుండి విజయ యాత్ర మొదలవుతుందని, దక్షిణాదిలో బిజెపి పాగా వేయడం తెలంగాణ నుండి మొదలవుతుందని చెప్పారని, ఇది పార్టీ శ్రేణులకు ఎంతో బలం చేకూరుస్తుందని అన్నారు. మూడు రోజుల పాటు తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా అనూహ్యమైన ప్రజాస్పందన గమనించానని, తెలంగాణలో అధికారంలోకి వచ్చేవరకూ తాను నిద్రపోయేది లేదని చెప్పారు. సమీక్షా సమావేశాల్లో పార్టీ ప్రధానకార్యదర్శులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని లక్ష్మణ్ వివరించారు. తెలంగాణలో బూత్ స్థాయిలో బిజెపి పటిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైందని పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ తరహాలో తెలంగాణలో సైతం అధికారంలోకి వస్తుందనే నమ్మకం కలిగిందని అన్నారు. 2019లో గెలుపే లక్ష్యంగా రోడ్‌మ్యాప్ రూపొందించామని చెప్పారు. ప్రజాహిత కార్యక్రమాలు, మోదీ విధానాలను ప్రజలకు చేరువ చేయడం, రాష్ట్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం, మరో పక్క పార్టీని సంస్థాగతం చేయడం, దీర్ఘకాలిక సమస్యలపై ప్రజాపోరాటాలకు నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించామని వివరించారు.
రోడ్ మ్యాప్ అమలులో సెప్టెంబర్‌కు ప్రత్యేకత ఉందని, అమిత్ షా మూడు రోజుల పర్యటన, తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమాలున్నాయని చెప్పారు. మూడేళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వ తీరు, అధికారంలోకి రాకముందు చేసిన వాగ్దానాలు, అధికారంలో వచ్చిన తర్వాత మాట్లాడుతున్న తీరు, ఎంఐఎంతో మిలాఖత్ అయిన తీరుపై ప్రజలకు వివరించడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ బూత్‌కు 25మంది చొప్పున 119 అసెంబ్లీల్లో భారీ సమ్మేళనాలను నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం చేస్తామని అన్నారు. ఏడు జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు పూర్తిచేశామని, ఆగస్టు చివరి నాటికి మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణలో మూడు రోజులు పర్యటనకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో అమిత్‌షా పర్యటన సందర్భంగా క్షేత్ర పరిశీలన నివేదికను జాతీయ పార్టీ రూపొందించిందని, దానిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. చాలా స్పష్టంగా తెలంగాణకు సంబంధించి మూడు రోజుల పర్యటన, అనుభవాలు పార్టీ పనితీరు, భవిష్యత్‌లో బిజెపి అనే అంశాలపై న్యూస్ లెటర్‌ను జాతీయ పార్టీ ప్రచురించిందని, దానిని విడుదల చేశామని అన్నారు. అమిత్ షా పార్టీ విస్తారక్ యోజనలో భాగంగా తెలంగాణలో పర్యటించబోతున్నారని అన్నారు. పార్టీని పోలింగ్ బూత్ స్థాయి నుండి పటిష్టం చేయడమేగాక, కేంద్రం చేపట్టిన పథకాలను కూడా ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు.

చిత్రం.. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న బిజెపి నేత లక్ష్మణ్