తెలంగాణ

కాల్పుల ఘటనలో కొత్తకోణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనపై కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 28న ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తెల్లవారుఝామున 3గంటల 18 నిమిషాల సమయంలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించి నెలకొన్న మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. తాజాగా విక్రమ్‌పై జరిగిన కాల్పులు వాస్తవమేనని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చారు. అయితే శుక్రవారం రాత్రి గం. 2.00లకు బయటకు వెళ్లిన విక్రమ్, తిరిగి 2.20కి ఇంటికి చేరాడు.
దీంతో పోలీసులు ఆ 20 నిముషాల వ్యవధిలో ఎక్కడికి వెళ్లాడు? ఎవరిని కలిశాడు? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. తనకు తానే కాల్చుకుని ఆసుపత్రిలో చేరేందుకు కుట్ర పన్నాడా? లేదా సుపారి ఇచ్చి మరీ కాల్చుకున్నాడా? అనే మీమాంస పోలీసులను వెంటాడుతోంది. కాగా విక్రమ్‌గౌడ్‌కు 3 నుంచి 5 అంగుళాల దూరం నుంచి కాల్పులు జరిగినట్టు పోలీసులు నిర్ధరించారు. విక్రమ్ షర్ట్‌పై గల గన్‌పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మంగళవారం గన్‌పౌడర్‌పై ఫోరెన్సిక్ నివేదిక అందనున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. విక్రమ్ ఇంట్లో సిసి కెమెరాలు పనిచేయకపోవటంతో ఇరుగుపొరుగు నివాసాల సిసి కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఆ రోజు రాత్రి కొన్ని వాహనాల రాకపోకలు సాగించినట్లు గుర్తించారు.
ముగ్గురు వ్యక్తులు విక్రమ్‌గౌడ్ ఇంటికి వచ్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంటికి వచ్చిన ఆధారాలు సేకరించినట్టు పోలీసులు తెలిపారు. ఏదేమైనా మంగళవారం పోలీసులకు అందనున్న ఫోరెన్సిక్ నివేదికలో విక్రమ్ కేసు దర్యాప్తులో స్పష్టత వచ్చే అవకాశముంది. ఒకవేళ విక్రమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటే ఆయనపై మారణాయుధాల చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున పూర్తిగా కోలుకున్న తర్వాత చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. తప్పుడు సమాచారం ఇచ్చిన అతని భార్య షిపాలికి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది.