తెలంగాణ

మియాపూర్ భూ కుంభకోణంపై సిబిఐ విచారణ కోసం పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: మియాపూర్ భూ కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని హైదరాబాద్ హై కోర్టులో రఘునందన్‌రావు పిటీషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మూడు వారాల్లో కోర్టుకు సమర్పించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రమేష్ రంగనాథన్ జస్టీస్ ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్‌రావును ఆదేశించింది. 682 ఎకరాల మియాపూర్ భూమి మాత్రమే కాకుండా 700 ఎకరాల భూమి కూడా ఈ కుంభకోణంలో ఉందని రఘునందన్‌రావు పిటీషన్‌లో పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల పేరుతో నకిలీ పత్రాలతో భూమిని హస్తగతం చేసుకున్నారని తెలిపారు. బెంచ్ ముందు ఆధారాలు చూపించాలని బెంచ్ ఆదేశించింది. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి రాగానే తగిన చర్యలు తీసుకున్నట్టు అడ్వకెట్ జనరల్ పార్థసారథి (ట్రినిటి ఇన్‌ఫ్రాక్చర్, సువిశాల్ పవర్ జనరేషన్‌లపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. సబ్ రిజిస్ట్రార్‌పై క్రిమినల్ కేసు పెట్టినట్టు, ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్టు చెప్పారు.