తెలంగాణ

దళితులంటే అంత చిన్న చూపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: సిరిసిల్ల ఘటనలో టిఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి, టి.పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ను తూర్పారబట్టారు. సిరిసిల్లలో దళితుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తే, నలుగురు దళితులే కదా? అని టిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడడం దురదృష్టకరమని డాక్టర్ గీతారెడ్డి అన్నారు. దళితులంటే అంత చిన్న చూపా? అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సిరిసిల్ల ఘటనపై ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. టి.పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ మంత్రి కెటిఆర్‌కు దమ్ముంటే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి సిరిసిల్ల నుంచి గెలుపొందితే తాను ముక్కు నేలకు రాస్తానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేని విధంగా ప్రభుత్వం పోలీసులతో హింసిస్తున్నదని ఆయన విమర్శించారు.
రైతు రుణాల్లో కుంభకోణం
ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఐఓబి బ్యాంకు రైతు రణాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని విమర్శించారు. భూమి ఒకరిదైతే రుణాలు వేరే వాళ్ళకు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ కుంభకోణంపై సిబిసిఐడి విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు రుణాలపై ఐఎఎస్ అధికారిని నియమించి మానిటర్ చేయించాలని ఆయన సూచించారు.