తెలంగాణ

కడ్తాల్ టోల్‌గేట్ సిబ్బందిపై తెరాస నేత తనయుడు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఆమనగల్లు, ఆగస్టు 1: అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి తనయుడు, తన స్నేహితులతో కలసి టోల్‌గేట్ సిబ్బందిపై దాడికి దిగడమే కాకుండా, టోల్‌గేట్ రుసుము చెల్లించకుండా కత్తులతో బెదిరింపులకు పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో సంచనం సృష్టించింది. కడ్తాల్ మండల కేంద్రానికి సమీపంలోని టోల్‌గేట్ వద్ద అదివారం రాత్రి చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి అమనగల్లు సిఐ రవీంద్రప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్‌కు చెందిన టిఅర్‌ఎస్ ఇన్‌చార్జి రాంమోహన్‌గౌడ్ తనయుడు మనీష్ గౌడ్‌తోపాటు అతని స్నేహితులు కడ్తాల్ మండలం మైసిగండిలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తూ, టోల్‌ప్లాజా వద్ద ఉన్న విఐపి గ్యాలరి నుంచి రుసుము చెల్లించకుండా వాహనంలో వెళ్తున్నారు.
కాగా అక్కడ పనిచేసే సిబ్బంది మహేష్, నవీన్ కుమార్, వెంకటేష్ గౌడ్ అడ్డుకొని టోల్‌గేట్ రుసుము చెల్లించాలని కోరారు. రుసుము చెల్లించక పోవడమే కాకుండా మనీష్ గౌడ్ స్నేహితుడు అరుణ్ కుమార్ రెడ్డి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సిబ్బంది గాయపడ్డారు. ఇదిలావుండగా సంఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి కేటిఆర్ తన ట్విట్టర్‌లో స్పందించారు. టోల్‌గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌లో ఆదేశించారు. ఈ మేరకు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డ అరుణ్ కుమార్ రెడ్డి, రిషల్‌సాయి, సతీష్ రెడ్డి, మనీష్ గౌడ్, సాయికుమార్, అనుదీప్‌పై హత్యయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ రవీంద్ర ప్రసాద్, ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కాగా అధికార పార్టీ నేతల తనయుడు, స్నేహితుల దాడి ఘటనలో గాయపడిన సిబ్బందిని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పరామర్శించారు.
అంతా అబద్ధం: టిఆర్‌ఎస్ నేత
కడ్తాల్ టోల్‌గేట్ సిబ్బందిపై తన కొడుకు మనీష్ దాడి చేసినట్టు వచ్చిన వార్త అంతా అబద్ధమని టిఆర్‌ఎస్ నేత రామ్మోహన్ గౌడ్ ఖండించారు. తన కొడుకు ఎవరిపై దాడి చేయలేదని, ఈ ఘటన దురదృష్టకరమన్నారు. దాడి జరిగిన సమయంలో మనీష్ డ్రైవింగ్ సీటులో ఉన్నాడని, అతడి స్నేహితుల్లో ముగుర్గరు దాడి చేశారని ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. గాయపడిన టోల్‌గేట్ సూపర్‌వైజర్ తన దూరపు బంధువని తెలిపారు. కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మైసిగండి ఆలయానికి వెళ్లేటప్పుడే రాను, పోనూ టోల్ ఫీజు చెల్లించినట్టు ఆయన చెప్పారు. టోల్‌గేట్ ఫీజు చెల్లించలేదనే ప్రచారం అవాస్తవమన్నారు.