తెలంగాణ

గీత దాటితే..వాతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా, పోలీస్ శాఖలు నెగెటివ్ పాయింట్ల విధానాన్ని మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను ఇక జరిమానాలతో సరిపెట్టకుండా, ప్రతి తప్పిదానికి నిర్దేశిత నెగెటివ్ పాయింట్లు విధిస్తారు. అలా 12 పాయింట్లు దాటితే..లైసెన్సు రద్దు చేయనున్నారు. హైదరాబాద్‌లో ఠ్రాఫిక్ వ్యవస్థ కచ్చితమైన నిబంధనల ప్రకారం నడిచేలా చూసేందుకు దేశంలోనే మొదటిసారిగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమలవుతోంది. ఇక్కడా పటిష్టంగా అమలు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగేలా చూడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నెగెటివ్ పాయింట్ల విధానం అమలు నేపథ్యంలో డిజిపి అనురాగ్ శర్మ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. జీరో పాయింట్లు మెయింటెన్ చేస్తూ హీరోగా ఉండాలని, 12 పాయింట్ల పెనాల్టీ వ్యవస్థ మంగళవారం హైదరాబాద్‌లో అమల్లోకి వచ్చింది.
నెగెటివ్ పాయింట్ల విధానం ఇదే..
* ప్రజా రవాణా వాహనాలు నడుపుతూ డ్రంకైన్ డ్రైవ్‌లో పట్టుబడితే..ఐదు పాయిట్లు
* దోపిడీలు, స్నాచింగ్‌లకు వాహనాలు ఉపయోగిస్తే..ఐదు పాయింట్లు
*రోడ్డు ప్రమాదంలో బాధితులు మరణిస్తే..ఐదు పాయింట్లు
* మద్యం సేవించి భారీ వాహనాలు, కార్లు నడిపితే..నాలుగు పాయింట్లు
* ద్విచక్ర వాహనాలు నడుపుతూ డ్రంకైన్ డ్రైవ్‌లో పట్టుబడితే..మూడు పాయింట్లు
* వేగం పరిమితి గంటకు 40 కిలోమీటర్లు ఉండి..మితిమీరితే.. మూడు పాయింట్లు
* రేసింగ్, మితిమీరిన వేగంతో వెళితే..మూడు పాయింట్లు
* నింబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను వాహనాల్లో తరలిస్తే.. రెండు పాయింట్లు
* రాంగ్ సైడ్ డ్రైవింగ్.. రెండు పాయింట్లు
* రోడ్డు నిబంధనలు పాటించకుండా వాయు, శబ్ద కాలుష్యం వెదజల్లే వాహనాలకు..రెండు పాయింట్లు
* వాహనానికి సరైన ధ్రువపత్రాలు లేకుండా నడిపితే..రెండు పాయింట్లు
*రోడ్డు ప్రమాదంలో బాధితులు గాయపడితే..రెండు పాయింట్లు
*ఆటోలో డ్రైవర్ పక్కన మరొకరిని కూర్చోబెట్టుకుంటే..ఒక పాయింట్
* సీటు బెల్టు, హెల్మెట్ పెట్టుకోకపోతే..ఒక పాయింట్ విధిస్తారు.