తెలంగాణ

కాళేశ్వరానికి విద్యుత్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఎత్తి పోతల పథకాలకు అవసరం అయిన విద్యుత్ కోసం విద్యుత్ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎత్తి పోతల పథకాలకు 12,500 మెగావాట్ల విద్యుత్ అవసరం అని అంచనా వేశారు. దీనికి అవసరం అయిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2018 జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్లు పని చేయనున్నాయని, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏర్పాటు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. గడువులోగానే విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, పంపిణీ లైన్ల ఏర్పాట్లు పూర్తి చేస్తామని ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్‌రావు తెలిపారు. విద్యుత్, ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం 2018 జూన్ నాటికి 12,500 మెగావాట్ల విద్యుత్తు అవసరమని మంత్రి చెప్పారు. ఈ మేరకు విద్యుత్ సరఫరాకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌రావు తెలిపారు. తమ సంస్థ దీనికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళికతో ఆయా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కాళేశ్వరం పంపు హౌజ్ల పనులు 2018 మార్చి చివరి నాటికి పూర్తి చేయడానికి టైం లైన్ పెట్టుకున్నందున విద్యుత్ సంస్థలు తమ పనులను మరింత వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. ప్యాకేజీల వారిగా పంపింగ్ స్టేషన్‌లను పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించినట్టు ట్రాన్స్‌కో అధికారులకు తెలిపారు. డిసెంబర్ నాటికి ప్యాకేజీ ఆరు పనులన్నీ పూర్తి చేయనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. వివిధ పనులకు సంబంధించి డెడ్‌లైన్లను ఖరారు చేశామని తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం పంప్ హౌజ్‌లన పనులు పుంజుకున్నాయని 2018 మార్చినాటికి పూర్తి అవుతాయని చెప్పారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌లో సాగునీటి అందించనున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌లో సాగునీటిని అందించనున్నట్టు తెలిపారు. మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు, పంపు హౌజ్‌లతో పాటు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులోనూ రిజర్వాయర్ల మీదుగా వెళ్తున్న 220 కెవి, 132 కెవి, 33 కెవి విద్యుత్ లైన్లను తరలించాలని మంత్రి కోరారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు హెచ్‌టి లైన్లు అడ్డంకిగా మారకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా రిజర్వాయర్ల పరిధిలోని హెచ్‌టి లైన్లు, టవర్ల తరలింపు ప్రక్రియ వెంటనే చేపట్టనున్నట్టు ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌రావు తెలిపారు.
2018 మార్చి పది లోగా సబ్ స్టేషన్లను పూర్తి చేయాలని హరీశ్‌రావు కోరారు. కాళేశ్వరం కోసం 59 టవర్ల ఏర్పాటు పూర్తి చేయాలని చెప్పారు. రానున్న రోజుల్లో ఇరిగేషన్, విద్యుత్ సంస్థలు మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇరిగేషన్, ట్రాన్స్‌కోకు చెందిన ఉత్సాహ వంతులైన ఇంజనీర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో ప్రాజెక్టు వద్ద ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని, వాటిలో ఈ టీమ్ పని చేయాలని సూచించారు.

చిత్రం.. మంగళవారం హైదరాబాద్‌లో ఇరిగేషన్, విద్యుత్‌శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి హరీశ్‌రావు