తెలంగాణ

ఉపాధ్యాయ విద్యకు కొత్తరూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: దేశంలో ఉపాధ్యాయ విద్యకు కొత్త రూపాన్ని ఇవ్వనున్నట్టు కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ఎంపి సి మల్లారెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రైవేటు బిఇడి, డిఇడి కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు మంగళవారం నాడు కేంద్ర మంత్రిని కలిసి ఉపాధ్యాయ విద్యా కళాశాలల నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతిపత్రం అందజేశారు. ఈ బృందంలో సూరం ప్రభాకరరెడ్డి, డాక్టర్ కె రామదాస్, జి రాజేష్, జె నారాయణ్, ఆర్ పి శ్రీపతి తదితరులున్నారు. ఉపాధ్యాయ విద్య తీరుతెన్నులను ఇన్నాళ్ల తర్వాత అధ్యయనం చేసేందుకు కేంద్ర పూనుకోవడం ముదావహమని వారు పేర్కొన్నారు. ఎన్‌సిటిఇ విధానాలకు, రాష్ట్రప్రభుత్వ విధానాలకు వైరుధ్యం ఉందని , రెండింటి మధ్య సారూప్యతను సాధించాలని అన్నారు. ప్రతి ఏడాది విద్యాసంవత్సరం జూన్‌లో మొదలై ఏప్రిల్‌లో ముగుస్తుండగా, అందుకు భిన్నంగా బిఇడి, డిఇడి అడ్మిషన్లు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రాక్టికల్స్‌నిర్వహణతో పాటు వార్షిక ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించడం కష్టమవుతోందని వారు కేంద్ర మానవ వనరుల మంత్రికి వివరించారు. అత్యుత్తమ బోధన సామర్ధ్యాలున్న అభ్యర్ధులను తయారుచేయాలనే ఆకాంక్ష ఎన్‌సిటిఇకి ఉన్నా అది సాధ్యం కావడం లేదని, దానికి కారణం కోర్సు ఫీజులు చాలా తక్కువగా ఉండటం, రాష్ట్రప్రభుత్వాల అజమాయిషీ ఉండటంతో ఇబ్బంది కరంగా మారుతోందని వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయ విద్యాసంస్థల్లో ప్రమాణాలను నిర్ధేశించే విధానంలో మార్పులు రావల్సిన అవసరం ఉందని, అందుకు నూతన మార్గదర్శకాలను, పంథాను మార్చాలని వారు చెప్పారు. ఉపాధ్యాయ విద్యా కళాశాలలకు సంబంధించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాలంటే ఏక రూపత సాధించాలంటే సమగ్ర సమావేశాన్ని నిర్వహించి వాటిపై అధ్యయనం చేయాలని వారు సూచించారు. అఫిడవిట్ల దాఖలకు గడువు ఆగస్టు 31 వరకూ పొడిగించినా, ఆన్‌లైన్‌లో సమర్పణకు వెబ్‌సైట్ పనిచేయడం లేదని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే బిఇడి కోర్సు వ్యవధిని ఏడాదికి తగ్గించాలని కూడా వారు సూచించారు.

చిత్రం.. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌తో భేటీ అయన ఎంపి మల్లారెడ్డి, బిఇడి,డిఇడి కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు