తెలంగాణ

తల్లీతండ్రీ లేకపోతే పెళ్లికూతురికే ‘కళ్యాణ’ చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కళ్యాణలక్ష్మి’, ‘షాదీముబారక్’ పథకాల కింద ఇస్తున్న ఆర్థిక సాయానికి సంబంధించి చెక్కులను పెళ్లికూతురు తల్లిపేరుతో ఇస్తున్నారు. తల్లితండ్రి లేని అమ్మాయిలకు ఇచ్చే డబ్బును విడుదల చేసేందుకు ఇప్పటి వరకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లాకలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని గత రెండేళ్ల నుండి ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. దాంతో ప్రభుత్వం గురువారం ఈ అంశంపై స్పష్టత ఇస్తూ జీఓ జారీ చేసింది. తల్లి, తండ్రిలేని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, ఇబిసిలకు చెందిన అమ్మాయి పెళ్లి జరిగితే, పెళ్లికూతురి పేరుతోనే 75,116 రూపాయలు చెక్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జి. అశోక్ కుమార్ పేరుతో గురువారం జీఓ (నెంబర్ 254) జారీ అయింది. సిసిఎల్‌ఎ, ఎస్‌సి, ఎస్‌టి, బిసి శాఖల కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జీఓలో సూచించారు.