తెలంగాణ

సర్వీసు ఏకీకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల మధ్య ఏకీకృత సర్వీసు రూల్స్ ఉండాలనే డిమాండ్ పట్ల దశాబ్దన్నరగా నానుతున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడబోతుంది. ప్రభుత్వ, స్ధానిక సంస్థలకు చెందిన ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలను ఆమోదిస్తూ సిఎం కె చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. దీంతో విద్యాశాఖలో పదోన్నతులకు ఆటంకాలు తొలిగిపోయినట్టే. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా విద్యారంగంపై చేపట్టిన ప్రత్యేక చర్చ సందర్భంగా ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు ఉండాలని ప్రతిపక్ష సభ్యులతో పాటు పాలకపక్ష సభ్యులు కూడా సూచించారు. సభలో ఏకాభిప్రాయం వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి మూలనబడిన ఫైల్‌ను తెప్చించుకుని ఆమోదం తెలిపారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు లేకపోవడం రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుంటుబడటానికి కారణాలలో ఇది కూడా ఒకటని విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా ముఖ్యమంత్రికి నివేదించినట్టు సమాచారం. ఏకీకృత సర్వీసు నిబంధనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు కూడా గత ఏడాది సెప్టెంబర్ 30న తీర్పు వెలువరించింది. దీంతో ఏకీకృత సర్వీసు నిబంధనలకు ఉన్న ప్రతిబంధకాలు తొలిగిపోవడంతో చివరగా ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలపడంతో ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్న ప్రతిబంధకాలు తొలిగిపోయినప్పటికీ, సుప్రీంకోర్టు పెట్టిన మెలికతో ఈ ఫైల్ తిరిగి రాష్టప్రతి ఆమోదానికి వెళ్లాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్టప్రతి అనుమతితో స్థానిక సంస్థల ఉపాధ్యాయుల కేడర్‌ను ఖరారు చేయాలని చెప్పింది. దీంతో ముఖ్యమంత్రి సంతకం తర్వాత ఈ ఫైలు రాష్టప్రతి ఆమోదానికి పంపించనున్నారు. రాష్టప్రతి నుంచి కూడా అమోదం లభించిన తర్వాత ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను ఏకీకృతం చేస్తూ చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ఇంతకాలానికి ఏకీకృత సర్వీసు నిబంధనలకు మోక్షం లభించనుండటంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి మోహన్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.