తెలంగాణ

మొన్న లాభం అన్నారు.. నేడు భారం అంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) తో మొన్నటి వరకు లాభం అని చెప్పి, ఇప్పుడు మాట మార్చి నష్టం, భారం అని చెప్పి మొత్తం తెలంగాణ ప్రజలను గందరగోళంలో పడేశారని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును విమర్శించారు. లోగడ పెద్ద నోట్ల రద్దు గురించి, ఇప్పుడు జిఎస్‌టి గురించి ఇలా ఒకే విషయం గురించి రెండు మాటలు మాట్లాడడం మీకు అలవాటుగా మారిందని రేవంత్ రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి విధానాన్ని అమలు చేయడానికి ముందు కేంద్ర స్థాయి లో ఎన్నో సమావేశాలను నిర్వహించిందని, ఇందులో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నా ఏనాడూ దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పలేదని ఆయన తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల కంటే ముం దుగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి జిఎస్‌టి బిల్లుపై ఎవరినీ మాట్లాడనీయకుండా చేసి యథాతథంగా ఆమోదించి పంపడం మీకు గుర్తు ఉండే ఉంటుందని ఆయన తెలిపారు. ఆర్థిక మం త్రి ఈటల రాజేందర్ జిఎస్‌టితో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, ఏటా రూ.4 వేల కోట్ల వరకు లోటు ఏర్పడే అవకాశం ఉందని అన్నారని ఆయన గుర్తు చేశా రు. అయితే ఈటల చెప్పినట్లుగా కేవలం 4వేల కోట్లతో జిఎస్‌టి ప్రభావం ఆగిపోదని, వాస్తవానికి మిషన్ భగీరథపై రూ.2 వేల కోట్లు, సాగునీటి ప్రాజెక్టులపై రూ. 8 వేల కోట్లు, మిషన్ కాకతీయపై 2,600 కోట్లు, డబుల్ బెడ్‌రూం ఇండ్లపై రూ.1600 కోట్లు, రోడ్లు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై రూ.5 వేల కోట్ల వరకు జిఎస్‌టి భారం పడుతుందని ఆయన తెలిపా రు. జిఎస్‌టి కారణంగా రాష్ట్రంపై రూ.20 వేల కోట్లకు పై గా భారం పడే ప్రమాదం ఉందని అధికారులు, ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు.