తెలంగాణ

సకల హంగులతో కొత్త సచివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ సచివాలయాన్ని బైసన్ పోలో గ్రౌండ్స్‌లో నిర్మించే ప్రతిపాదన ఖరారు కావడంతో ప్రస్తుతం సచివాలయంలో ఉన్న భవనాల్లో నగరానికి చెందిన ప్రభుత్వ శాఖల ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రభు త్వం పరిశీలిస్తోంది.
బైసన్‌పోలో మైదానానికి సచివాలయాన్ని తరలించిన తర్వాత ప్రస్తుత సచివాలయ భవనాలు ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వ స్థాయిలో తర్జన భర్జనలు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలను ప్రస్తుత సచివాలయంలో తరలించి ప్రజలకు అన్ని సేవలను ఒక గొడుగు కింద అందించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గా లు తెలిపాయి. బైసన్‌పోలోలో నిర్మించే అసెంబ్లీ, సచివాల యం, అంతర్జాతీయ కనె్వన్షన్ సెంటర్‌కు కొత్త నమూనాను రూపొందించే ప్రక్రియ కూడ మొదలైంది. వీలైనంత త్వరలో బైసన్‌పోలో మైదానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు రక్షణ శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. సికింద్రాబాద్ కంటోనె్మంట్ బోర్డు కూడా ఈ స్ధలాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తూ త్వరలో తీర్మానం చేయనున్నట్లు సమాచారం.
సికింద్రాబాద్ నుంచి బోయిన్‌పల్లి, శామీర్ పేటకు వేరువేరుగా రెండు ఫ్లైవోవర్లను నిర్మించడం, ఇదే ప్రాంతంలో తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ రానుండడం తో 44వ నంబర్ జాతీయ రహదారి, రాజీ వ్ రహదారికి మహర్దశ పట్టనున్నాయి. దీనివల్ల సికింద్రాబాద్ నగర రూపురేఖలు మారనున్నాయి. కొన్నివేల మంది ఉద్యోగులు తరలిరానుండడంతో కండ్లకోయ, కొంపల్లి, శామీర్‌పేట, తూముకుంట పరిసర గ్రామాల్లో వచ్చే రెండు మూడేళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకునే అవకాశం ఉంది. కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించిన తర్వాత ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని కూడా మ్యూజియంగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పుడు పబ్లిక్ గార్డెన్‌లో ప్రభుత్వ మ్యూజియం ఉంది. కొత్త అసెంబ్లీ,సచివాలయం, అంతర్జాతీయ కనె్వన్షన్ సెంటర్‌ల భవన నమూనాల రూపొందించే బాధ్యత ముంబాయి కి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ అనే ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌కు అప్పగించే అవకాశం ఉంది. బైసన్‌పోలో గ్రౌండ్స్‌లో సచివాలయం, అసెంబ్లీ, అంతర్జాతీయ కనె్వన్షన్ సెంటర్‌ను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అద్దంపట్టే విధంగా నిర్మించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనం తెలంగాణ సంస్కృతికి తగ్గట్టుగా లేవనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. సచివాలయం నిర్మాణానికి అయ్యే వ్యయంపై ఆర్థిక శాఖ కసరత్తును ప్రారంభించింది. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు రూ. 600 నుంచి రూ. 750 కోట్ల వ్యయమయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది కొత్త సచివాలయం నిర్మాణానికి బడ్జెట్లో వంద కోట్లు కేటాయించారు.
ఈ నిధులను రక్షణ మంత్రిత్వశాఖకు చెల్లించే అవకాశం ఉంది. కొత్త సచివాలయం, అసెంబ్లీ తదితర నిర్మాణాలకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టుకు దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఆర్థిక సంస్ధల నుంచి నిధులను సేకరించి కొత్త భవనాల నిర్మాణం సత్వరమే చేపట్టాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది.