తెలంగాణ

జిఎస్టీ భారంపై కేంద్రాన్ని ఒప్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6:జీఎస్టీని ఏకపక్షంగా అమలు చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని టిఆర్‌ఎస్ ఎంపిలు వేర్వేరుగా జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు 18 నుంచి జిఎస్‌టిని 12శాతానికి తగ్గించారని, అయితే దానిని కూడా రాష్ట్రాలు భరించలేవని ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్ తెలిపారు. ఎన్‌డిఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఎస్టీకి తెలంగాణ ప్రభుత్వం బేషరతుగా మద్దతు ఇచ్చిందని, బిల్లు పాస్ అయ్యేంత వరకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చిందని, అయితే బిల్లు ఆమోదం పొందిన తరువాత రాష్ట్రాల అభిప్రాయాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలకు అవసరమైన ప్రాజెక్టుల పనులు నిలిచిపోయేట్టుగా ఇష్టం వచ్చినట్టు పన్ను విధించడం మంచిది కాదని అన్నారు. మూడేళ్ల నుంచి బిజెపికి అన్ని అంశాల్లోనూ టిఆర్‌ఎస్ మద్దతు ఇస్తోందని గుర్తు చేశారు. మిషన్ భగీరథ, కాకతీయ, డబుల్ బెడ్‌రూమ్‌పై పెద్ద ఎత్తున జిఎస్‌టి భారం పడుతుందని అన్నారు.
రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లయినా సమస్యలు అలానే ఉన్నాయని, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని వారు కోరారు. జీఎస్టీ భారం తగ్గించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఇదే సమస్య ఉన్నందున, వాటిని కూడా కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి హక్కులు సాధించడం టిఆర్‌ఎస్‌కు కొత్తేమీ కాదని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తితో పని చేయాలని బాల్క సుమన్ కోరారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై జిఎస్‌టి భారం 18 నుంచి 12శాతానికి తగ్గించినా, రాష్ట్రాలు భరించలేవని అన్నారు. కేంద్రం చేస్తున్న మంచి పనులకు స్వాగతిస్తూనే రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే చర్యలపై పోరాడుతామని ఆయన తెలిపారు.