తెలంగాణ

సినీ పరిశ్రమ పరువు తీశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: సినీ పరిశ్రమ సిగ్గుపడాల్సిన విషయం డ్రగ్స్ స్కాండల్ కాదు, ఆడ్రగ్స్ స్కాండల్‌కు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగ లేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తరవంపులు తెచ్చే విధంగా అనవసర ప్రాధేయ పడిన విధానం అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ లేఖ రాశారు. నోటీసులు అందుకుని, విచారణకు హాజరైన వారిలో ఏ ఒక్కరూ తాము తప్పు చేశామని బహిరంగంగా చెప్పలేదు, వారిలో ఫలానా వారి తప్పు రుజువు అయింది అని అధికారులు చెప్పలేదని, ఈ రెండూ జరగనప్పుడు ఏ కారణానికి క్షమాపణ చెప్పారని వర్మ ప్రశ్నించారు. అతి కొద్ది మంది చేసిన పొరపాట్లకు ఒక పరిశ్రమ తల వంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం అని రాశారని, ఎవరు పొరపాటు చేశారు, ఎవరు మీకు చెప్పారని ప్రశ్నించారు. నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం‘‘మీలో ఏ మాత్రం పౌరుషం ఉన్నా, మీపై వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసిక వేదనపై మీరు ఏ మాత్రం నైతిక బాధ్యతగా భావిస్తున్నా జరిగిన ఆరోపణలపై నోరు విప్పి మీరు కూడా బహిరంగ లేఖలు రాయాలని వర్మ సూచించారు. ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఫిల్మ్ ఛాంబర్‌కి ఏ మాత్రం విచక్షణ ఉన్నా అధికారులకు బహిరంగ క్షమాపణ లేఖ రాసినట్టే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లందరికీ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణ చెప్పాలని రాంగోపాల్ వర్మ డిమాండ్ చేశారు.