తెలంగాణ

ప్రైవేటు ఆస్పత్రుల వైఖరిపై రాష్ట్ర హైకోర్టు మందలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: ప్రైవేటు వైద్యశాలల పనితీరు, వైఖరిపై రాష్ట్ర హైకోర్టు మందలించింది. కేర్ నాంపల్లి వైద్యశాల వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న టి సునీతతో పాటు గ్లోబల్ హాస్పటల్‌లో ఆపరేషన్ తర్వాత నడవలేని పరిస్థితికి చేరుకున్న నిఖిల్‌రెడ్డి తరఫున నరేందర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ సంఘటనలో కోర్టుకు హాజరైన వారి న్యాయవాదులు ఆస్పత్రుల తీరును దుయ్యబట్టారు. ఇప్పటికే ఎన్నోమార్లు సమయం ఇచ్చినా, ఆధారాలతో సహా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించినా, ఆస్పత్రి ప్రతినిధులు రాకపోవడం,కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ రజనిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు కేర్, గ్లోబల్ ఆస్పత్రులకు ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇక ప్రభుత్వానికి రెండు వారాలు గడువు ఇస్తూ తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. దీంతో బాధితుల తరఫున న్యాయవాది అర్జున్ మాట్లాడుతూ పిటీషనర్లకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని అన్నారు.