రాష్ట్రీయం

కాంగ్రెస్‌లోకి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 5: పేద బడుగు, అసంఘటిత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి వ్యవహరిస్తున్న టిడిపి ప్రభుత్వాన్ని 2019 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుని పోయే విధంగా టిడిపి, బిజెపి వ్యతిరేకులందర్నీ ఒక్కతాటిపైకి తీసుకువస్తానని, జగన్, పవన్‌లను స్వయంగా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తానని మాజీ కేంద్రమంత్రి డాక్టర్ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో జగ్జీవన్‌రామ్ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ జగన్, పవన్ కల్యాణ్ ఇద్దరూ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలోని 50శాతం మంది ప్రజలు కొత్త గొంతు, కొత్త ముఖం, కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీకి సేవ చేస్తూ నూతన రాజకీయ ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేస్తానన్నారు. బిజెపి, టిడిపి విధానాలను వ్యతిరేకిస్తున్నవారిని ఒక్కటి చేసేందుకు తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి రాజకీయ కార్యాచరణ రూపొందిస్తానన్నారు. ఇందులో భాగంగానే వామపక్ష నేతలతో తనకున్న పరిచయాలతో వారిని కూడా ఒకతాటిపైకి తీసుకువస్తానని ప్రకటించారు. జగజ్జీవన్‌రామ్ జయంతి రోజు నుంచే ఈ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నానన్నారు. 1994లో పివి నరసింహారావు ఓటమిలో తనపాత్ర ఉందని చెప్పుకున్నారు. 1999లో వాజపేయి ఒక్క ఓటుతో బలపరీక్షలో ఓటమివెనుక ఉన్నది సుబ్రహ్మణ్యం స్వామి కాదని, తిరుపతిలో మీ మధ్య ఉన్న చింతామోహన్ అని పేర్కొన్నారు. ఢిల్లీలో రాజకీయంగా అన్నీ చక్కబెట్టానన్నారు. మన్మోహన్ సింగ్‌ను ప్రధాని చేయడానికి వామపక్షాలు ససేమిరా అన్నాయని, అయితే తన చొరవతో వారు అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటు తరువాత 10వేల కోట్లతో జాతీయ రహదారుల ఏర్పాటులో తాను కీలక పాత్ర పోషించానన్నారు. దుగ్గరాజ పట్నం ఓడరేవు, మన్నవరం భెల్ ప్రాజెక్టు, తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రి ఏర్పాటులో కూడా తాను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో మాట్లాడి ఏర్పాటు చేశానని అన్నారు.
వైఎస్ జగన్ లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డాడంటూ ఆయనను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అయితే నేడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉంటూ అవినీతికి పాల్పడుతున్నారని వారి ఆస్తులపై సిబిఐ చేత విచారణ జరిపించాలని అన్నారు. అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ అన్నదమ్ముల్లా మెలిగేవారని, వారి మధ్య అభిప్రాయ భేదాలు తీసుకురావడానికి ఒకప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రయత్నించి విఫలమయ్యారని అన్నారు. నేడు తిరిగి అంబేద్కర్, జగజ్జీవన్‌రామ్‌ల మధ్య విభేదాలున్నట్లు కొంతమంది తెరపైకి తీసుకురావడాన్ని తప్పుపట్టారు. అందరం ఐక్యంగా ఉంటేనే దళిత, గిరిజనులకు మేలు జరుగుతుందని చెప్పారు.