తెలంగాణ

ఏజెన్సీ రోడ్లకు 247 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: ఏజెన్సీ ప్రాంతాల్లోని రోడ్లకు 247 కోట్ల రూపాయలు, మైదాన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. గిరిజనాభివృద్ధిపై మంత్రి గిరిజనాభివృద్ధి శాఖ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభివృద్ధికి దూరంగా ఉన్న తండాలకు తారు రోడ్లు వేయడం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగు పడి గిరిజనుల జీవితాలు బాగు పడతాయని అన్నారు. గిరిజన భవనాలు, యూత్ ట్రైనింగ్ సెంటర్లు, గురుకుల పాఠశాల భవనాలు, పోస్ట్ మెట్రిక్ పాఠశాలల భవనాల నిర్మాణాలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.