తెలంగాణ

నేరెళ్ల బాధితులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, ఆగస్టు 8: సిరిసిల్ల రాజన్న జిల్లా నేరెళ్లలో దళితులపై ఇటీవల జరిగిన ఘటన బాధా కరం, దురదృష్టకరమని, ఈ ఘటనలోని బాధితులను ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని పురపాలక, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన వేములవాడ పట్టణంలో మనోహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నే రెళ్ల బాధితులను ఎమ్మెల్యేలు రమేశ్‌బాబు, పుట్ట మధుతో స్వయంగా కలుసుకుని పరామర్శించారు. చికిత్స పొందుతున్న బాధితుల గదిలోకి మీడియాను అనుమతించకుండా తలుపులు మూసి వేసి బాధితులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతర స్థానిక శాస నసభ్యుడు రమేశ్‌బాబు నివాసానికి వెళ్లి అక్కడే విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం నేరెళ్ల ఘటనను వాడుకుంటున్నాయని, ప్రజల నుంచి తనను దూరం చేసే కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు టూరిస్టుల్లాంటి వారని ..వారు వస్తా రు..పోతారు...కానీ శాశ్వతంగా ప్రజలతో ఉండేది.. ఈ నియోజకవర్గానికి సేవ చేసేది తానేనని.. ప్రజల ఆశీస్సులతో తాను ఈ స్థాయికి ఎదిగానని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించి డిఐ జి స్థాయి అధికారితో విచారణ జరుగుతున్నదని, నివేదికలు రాగానే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇక ఇసుక మాఫియాను, ఇసుక దందాను ప్రభుత్వం ప్రోత్సహించదని, మూడు సంవత్సరాల తెరాస పాలనలో ఇసుక ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1000 కోట్ల ఆదాయం సమకూరిందని ఆయ న అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుక దందా నడిచిందని, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడం సరైన విధానం కాదని, వారి తిట్లను దీవెనగానే తాను భావిస్తున్నానని చెప్పా రు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసమే తమపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. మిడ్‌మానేరులో పది టిఎం సిల నీటిని నింపాలనే లక్ష్యంతోనే ఇసుకను తీస్తున్నామని వివరణ ఇచ్చారు. టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావు,నగర పంచాయతీ చైర్మన్ ఉమాలక్ష్మిరాజం తదితరులు పాల్గొన్నారు.